బాలీవుడ్ బాద్షా చిత్రంలో Rana Daggubati ?

ABN , First Publish Date - 2022-06-25T16:04:51+05:30 IST

దక్షిణాది కథలపైనే కాకుండా.. హీరోలపై, దర్శకులపై బాలీవుడ్ వారు తెగ ఫోకస్ పెడుతున్నారు. అలాగే.. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి సైతం వారు ఆలోచించడంలేదు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్‌’ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్ర చేస్తుండగా.. సల్మా్న్ ఖాన్ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ (Vekatesh) ప్రధానపాత్ర చేస్తుండడంతో పాటు.. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) అతిథి పాత్రలో మెరవబోతున్నాడు.

బాలీవుడ్ బాద్షా చిత్రంలో Rana Daggubati ?

దక్షిణాది కథలపైనే కాకుండా.. హీరోలపై, దర్శకులపై  బాలీవుడ్ వారు తెగ ఫోకస్ పెడుతున్నారు. అలాగే.. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి సైతం వారు ఆలోచించడంలేదు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్‌’ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్ర చేస్తుండగా.. సల్మా్న్ ఖాన్ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ (Vekatesh) ప్రధానపాత్ర చేస్తుండడంతో పాటు.. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) అతిథి పాత్రలో మెరవబోతున్నాడు. రణబీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్ ప్రధాన పాత్రల్లో భారీ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కీలకపాత్ర చేస్తున్నారు. ఇంకా.. ఆమిర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ (Lalsingh Chadda) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan) చిత్రంలో రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 


తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో .. షారుఖ్ హీరోగా ‘జవాన్’ (Jawan) అనే భారీ పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఇటీవల అధికారికంగా వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. జవాన్ గా షారుఖ్ ఇంటెన్స్ లుక్ అభిమానుల్ని మెప్పించింది. ఈ సినిమాలో నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తోంది. ఇందులో కీలక పాత్రకోసం రానా దగ్గుబాటిని దర్శకుడు అట్లీ సంప్రదించినట్టు .. రానా నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు టాక్. రానాకు ఆల్రెడీ బాలీవుడ్‌లో మంచి క్రేజున్న సంగతి తెలిసిందే. అక్కడ రెండు, మూడు డైరెక్ట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో రానాను ఎంపిక చేసినట్టు సమాచారం. 


షారుఖ్ ఖాన్ గతంలో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ (Chennai Express) అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇక్కడ కూడా ఆ సినిమా అలరించింది. ఈ సినిమా మొత్తం సౌత్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. ఈ సినిమా తర్వాత షారుఖ్ మళ్ళీ ఇలాంటి సినిమాలో నటించలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ ‘జవాన్’ చిత్రంతో సౌత్ టెక్నీషియన్స్ తో పనిచేస్తుండడం విశేషం. మరి ఈ సినిమాలో రానా నిజంగానే నటించబోతున్నాడో లేదో తెలియాలంటే. కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-25T16:04:51+05:30 IST