Rana Daggubati ‘విరాట పర్వం’ విడుదల ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-05-07T02:03:00+05:30 IST

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’

Rana Daggubati ‘విరాట పర్వం’ విడుదల ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న  చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో.. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri ) ఈ చిత్రాన్ని నిర్మించారు. 


ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం విషయంలో అనేకానేక వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో కాదని, డైరెక్ట్‪గా ఓటీటీ విడుదల చేస్తున్నారనేలా కూడా వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ చిత్ర విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇస్తూ.. శుక్రవారం విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‪ను విడుదల చేశారు.


ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‪లో అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా.. సాయిపల్లవి అతని చేయి పట్టుకొని పరుగు తీస్తోంది. చూస్తుంటే ఇది ఒక వార్ మూమెంట్‪ని తలపిస్తుంది. ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ.. దర్శకుడు వేణు తన ట్విట్టర్ అకౌంట్‪లో.. 

‘‘తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం 

మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం . 

ప్రేమ యుద్ధమై  సాగిన  విరాటపర్వం . జులై ఒకటవ తేదీన మీ ముందుకు...’’ అని రాసుకొచ్చారు.   


కాగా, 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది దర్శకుడు వేణు రూపొందించిన ఈ చిత్రంలో.. రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. వెన్నెల పాత్రలో సాయిపల్లవి  కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని మేకర్స్ తెలుపుతున్నారు. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి  సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు.



Updated Date - 2022-05-07T02:03:00+05:30 IST