Rana Naidu: బాబాయ్‌కి గన్ను పెట్టిన అబ్బాయ్.. టీజర్ అదిరిపోయిందిగా..

ABN , First Publish Date - 2022-09-24T19:48:23+05:30 IST

బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో..

Rana Naidu: బాబాయ్‌కి గన్ను పెట్టిన అబ్బాయ్.. టీజర్ అదిరిపోయిందిగా..

బాబాయ్ వెంకటేశ్ (Venkatesh), అబ్బాయ్ రానా (Rana) కలిసి ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌ పేరు ‘రానా నాయుడు’.(Rana Naidu) ఇందులో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవాన్’కి రిమేక్‌గా తెరకెక్కింది.


‘రానా నాయుడు’ టీజర్‌ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దానికి.. ‘దగ్గుబాటి VS దగ్గుబాటి చూడటానికి ఇదే అద్భుతమైన సమయం. అయితే ఇది మీ రోజువారీ కుటుంబ డ్రామా కాదు. బాబాయ్, అబ్బాయ్ ఒకరితో ఒకరు గొడపడడం RanaNaiduలో చూస్తారు. త్వరలోనే మీ ముందుకు వస్తున్నారు’ అని రాసుకొచ్చింది. అయితే.. ఈ టీజర్ హిందీలో మాత్రమే ఉంది. తెలుగులో లేదు. కానీ.. వారిద్దరి తెలుగు నటులు కావడం, మూవీ జరిగేది కూడా హైదరాబాద్ కేంద్రంగా కావడంతో తెలుగులో డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే.. ఈ సిరీస్ కుటుంబ కథాలాగా కాకుండా థ్రిల్లర్‌గా తెరకెక్కడం ప్రేక్షకులను, దగ్గుబాటి అభిమానులకు సంతోషంగా కలిగించేలా ఉంది. అంతేకాకుండా.. అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ పోటీ పడి నటించారు. అది చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు థ్రిల్ ఫిలయ్యే అంశాలు అన్ని ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ టీజర్‌పై పలువురు దగ్గుబాటి అభిమానులు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలాంటి ఇంతవరకూ చూడలేదు. ఆతృతగా వెయిట్ చేస్తున్నాం’ అంటూ కొందరు.. ‘టీజర్ చూస్తే మతిపోతోంది’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఇంకొదరైతే తెలుగులో టీజర్ విడుదల చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా.. వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమాలో చేస్తున్నాడు. మరోవైపు.. రానా చేతిలో సైతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.



Updated Date - 2022-09-24T19:48:23+05:30 IST