11:11 movie : యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని

ABN , First Publish Date - 2022-05-25T21:40:42+05:30 IST

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (koti) తనయుడు రాజీవ్ సాలూరు (Rajiv Saluru) హీరోగా, వర్ష విశ్వనాథ్ (Varsha Viswanath) హీరోయిన్‌గా ఆర్.కె నల్లూరి (Rk Nalluri) తెరకెక్కి్స్తున్న వెరైటీ మూవీ ‘11: 11’. ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

11:11 movie : యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (koti) తనయుడు రాజీవ్ సాలూరు (Rajiv Saluru) హీరోగా, వర్ష విశ్వనాథ్ (Varsha Viswanath) హీరోయిన్‌గా ఆర్.కె నల్లూరి (Rk Nalluri) తెరకెక్కిస్తున్న వెరైటీ మూవీ ‘11: 11’.  ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం’ అంటూ సాగే ఈ పాటను ఎనర్జిటిక్ స్టార్  రామ్ (Ram)  చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ మేజర్ హైలైట్ అయ్యింది. 


తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లుగా చక్కటి సాహిత్యంతో రాకేందు మౌళి (Rakendu mouli) ఈ పాటను రాశారు. ఈ సాంగ్ విడుదల చేసిన అనంతరం సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలిపారు హీరో రామ్ (Ram). ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇక ‘11: 11’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతులమీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా (Daggubati Rana) చేతులమీదుగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది.  అతిత్వరలో ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. 



Updated Date - 2022-05-25T21:40:42+05:30 IST