Ram Pothineni : బోయపాటి చిత్రంపైనే ఆశలన్నీ !

ABN , First Publish Date - 2022-08-16T20:12:04+05:30 IST

ఫ్లాపులతో సతమతమవుతున్న.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ని ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో యూత్‌లో మరింత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Ram Pothineni : బోయపాటి చిత్రంపైనే ఆశలన్నీ !

ఫ్లాపులతో సతమతమవుతున్న.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ని ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో యూత్‌లో మరింత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రం దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌నీ హిట్ గట్టుపై నిలబెట్టింది. రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రలతో రామ్ అదరగొట్టాడు. అయితే అంతలోనే రామ్‌కు తదుపరి చిత్రం ‘రెడ్’ (Red) రూపంలో ఫ్లాప్ ఎదురైంది. గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈసినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేసినప్పటికీ అంతగా ఫలితం దక్కలేదు. తమిళ హిట్ చిత్రం ‘తడం’ (Thadam) ఆధారంగా రూపొందిన ఈ సినిమా దర్శకుడిగా కిశోర్ తిరుమలకి చేదు అనుభవాన్ని మిగిల్చింది.


‘రెడ్’ చిత్రంతో మళ్లీ పరాజయ బాట పట్టిన రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy) దర్శకత్వంలోని ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ (The Warrior) పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. డాక్టర్‌గా, పోలీసుగా రెండు డిఫరెంట్ గెటప్స్, రెండు వేరియస్ కేరక్టరైజేషన్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రామ్ ఫ్లాప్స్ లిస్ట్‌లో ‘ది వారియర్’ కూడా చేరిపోయింది. ఇక రామ్ కున్న ఒకే ఒక హోప్.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమే. మాస్ యాక్షన్ చిత్రాల్లో నటించడానికి ఎంతో ఉత్సాహం చూపించే రామ్ పోతినేని, మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి దర్శకత్వంలో నటించబోతుండడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. 


నటసింహ బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి (Boyapati)  తెరకెక్కించిన ‘అఖండ’ (Akhanda) చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా బోయపాటి స్టైల్లోని పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కనుందట. రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ స్టోరీని బోయపాటి రెడీ చేశాడట. మాస్ ఎలిమెంట్స్ ను, ఎమోషన్స్‌ను పెర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని హిట్ కొట్టడంలో బోయపాటి దిట్ట. మరి రామ్ పోతినేనికి బోయపాటి ఏ స్థాయి హిట్టిస్తాడో చూడాలి.       

Updated Date - 2022-08-16T20:12:04+05:30 IST