Ram pothineni : మాస్ మంత్రం జపిస్తున్నాడు !

ABN , First Publish Date - 2022-05-18T15:58:25+05:30 IST

మాస్ ప్రేక్షకుల మనసు గెలుచుకొని స్టార్ హీరోగా ఎదగాలంటే.. ఏ హీరో అయినా మ.. మా.. మాస్ అనాల్సిందే. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ లీడ్‌లో ఉన్న హీరోలంతా మాస్ జనానికి దగ్గరైన వారే. ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి టాలీవుడ్‌లో చాలా మంది యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు.

Ram pothineni : మాస్ మంత్రం జపిస్తున్నాడు !

మాస్ ప్రేక్షకుల మనసు గెలుచుకొని స్టార్ హీరోగా ఎదగాలంటే.. ఏ హీరో అయినా మ.. మా.. మాస్ అనాల్సిందే. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ లీడ్‌లో ఉన్న హీరోలంతా మాస్ జనానికి దగ్గరైన వారే. ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి టాలీవుడ్‌లో చాలా మంది యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని (Ram pothineni) ముందు వరుసలో ఉంటాడు. మంచి పెర్సనాలిటీ, చక్కటి డిక్షన్, అంతకు మించిన పెర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ హీరో సినిమాల లైనప్ చూస్తే..  అతడు మాస్ ఇమేజ్ కోసం ఎంతలా తాపత్రయపడుతన్నాడో అర్ధమవుతుంది. కెరీర్ బిగినింగ్ నుంచి లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్‌లో ఎక్కువగా నటించిన రామ్.. మధ్యమధ్యలో యాక్షన్ హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేశాడు. అయితే వాటిలో కొన్ని చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి.


అయితే పూరీ జగన్నాథ్ (Puri jagannath) ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) చిత్రంతో పూర్తిగా మాస్ అవతార్‌లో చెలరేగి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు రామ్ (Ram). ఆ సినిమా రామ్‌కు అభిమానుల్లో మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘రెడ్’ (Red) అనే మూవీలోనూ మాసీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. అయినప్పటికీ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం మానలేదు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. తాజాగా లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమాతో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో రామ్ స్టైలిష్ అండ్ మాసీ యాక్టింగ్ అభిమానుల్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో రామ్ పెద్ద హిట్టే కొట్టబోతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 


ఇక దీని తర్వాత రామ్ పోతినేని (Ram pothineni) .. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను (Boyapati srinu) దర్శకత్వంలో నటించబోతున్నాడు. రామ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఒక అదిరిపోయే మాస్ సబ్జెక్ట్‌తో బోయపాటి రెడీ అవుతున్నాడు. హీరోలకు హైఓల్టేజ్ ఎలివేషన్స్ ఇచ్చే బోయపాటి.. రామ్ పోతినేనిని కూడా ఆ రేంజ్‌లోనే ఎలివేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతి త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత రామ్ పోతినేని వరుసగా మాస్ చిత్రాలే చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై రామ్‌తో సినిమా చేయాలంటే.. ఏ దర్శకుడైనా అదిరిపోయే మాస్ కథ రాసుకోవాల్సిందే.  ఇకపై  లవ్ స్టోరీల్లో నటించే ఆసక్తి తనకు లేనట్టే వరుసగా యాక్షన్ చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు రామ్. మరి రామ్ రూట్ అతడ్ని ఎంత వరకూ తీసుకెళుతుందో చూడాలి. 

Updated Date - 2022-05-18T15:58:25+05:30 IST