Interesting : బిగ్‌బీ‌తో మరోసారి వర్మ

ABN , First Publish Date - 2022-06-16T18:20:54+05:30 IST

వివాదాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma).. కొంతకాలంగా తెలుగులో వరుస చిత్రాల్ని వదులుతున్నారు. ఎప్పుడు ఏ సినిమా తీస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం ‘డేంజరస్ (Dangerous), కొండా (Konda) ’ సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Interesting : బిగ్‌బీ‌తో మరోసారి వర్మ

వివాదాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma).. కొంతకాలంగా తెలుగులో వరుస చిత్రాల్ని వదులుతున్నారు. ఎప్పుడు ఏ సినిమా తీస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం ‘డేంజరస్ (Dangerous), కొండా (Konda)’  సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ‘కొండా’ చిత్రం వచ్చే వారం విడుదల కానుండడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు వర్మ. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన వర్మ తదుపరి చిత్రాల విషయమై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ఓ భారీ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ లో వర్మకు బాగా సన్నిహితంగా ఉండే నటుడు ఎవరంటే.. అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పేరు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachan). ఆయనతో వర్మకి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో వర్మ అమితాబ్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.


అమితాబ్ బచ్చన్ తో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘సర్కార్’ (Sarkar) ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఆ తర్వాత తీసిన ‘సర్కార్‌రాజ్’ (Sarkar Raj) పర్వాలేదనిపించుకుంది. ‘షోలే’ (Sholey) చిత్రాన్ని వర్మ ‘ఆగ్’ (Aag) పేరుతో రీమేక్ చేశారు. అందులో అమితాబ్ విలన్ గా నటించారు. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆఖరుగా వర్మ అమితాబ్ తో తీసిన ‘రణ్’ చిత్రం కూడా అట్టర్ ఫ్లాపైంది. మొత్తానికి వర్మ అమితాబ్ తో తీసిన నాలుగు చిత్రాల్లో రెండు సినిమాలు మాత్రమే జనాదరణ పొందాయి. ఇప్పుడు మళ్లీ పన్నెండేళ్ళ తర్వాత అమితాబ్ తో వర్మ మరో సినిమా చేయబోతుండడం ఆసక్తిగా మారింది. హారర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వర్మ చెప్పారు.


ఈ ఏడాది నవంబర్‌లో అమితాబ్ డేట్స్ ఇచ్చినట్టు వర్మ తెలిపారు. నవంబర్ లో సినిమాను ప్రారంభించి తక్కువ సమయంలో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అగ్రనటీనటులతో సినిమాలు చేయని వర్మ.. ఈ సినిమాతో మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మగా మారతారని అందరూ ఆశిస్తున్నారు. మరి బిగ్ బీ (Big B) ఇచ్చిన అవకాశాన్ని వర్మ  ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. 

Updated Date - 2022-06-16T18:20:54+05:30 IST