Khiladi దర్శకుడ్నే మళ్ళీ నమ్ముతున్న రవితేజ ?

ABN , First Publish Date - 2022-06-25T19:38:06+05:30 IST

ఒక దర్శకుడ్ని నమ్మితే.. అతడి ట్రాక్ రికార్డ్ పట్టించుకోడు రవితేజ. అతడు హిట్టిచ్చినా.. ఫ్లాపిచ్చినా.. అవకాశమొస్తే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడంలో అతడికి ఎలాంటి మొహమాటం ఉండదు. ఇలా ఎంతో మంది దర్శకులతో రవితేజ తన కెరీర్‌లో ట్రావెల్ చేశాడు. అలాంటి వారిలో రమేశ్ వర్మ ఒకడు. రవితేజతో గతంలో ‘వీర’ అనే సినిమాను తెరకెక్కించాడు రమేశ్ వర్మ.

Khiladi దర్శకుడ్నే మళ్ళీ నమ్ముతున్న రవితేజ ?

ఒక దర్శకుడ్ని నమ్మితే.. అతడి ట్రాక్ రికార్డ్ పట్టించుకోడు రవితేజ. అతడు హిట్టిచ్చినా.. ఫ్లాపిచ్చినా.. అవకాశమొస్తే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడంలో అతడికి  ఎలాంటి మొహమాటం ఉండదు. ఇలా ఎంతో మంది దర్శకులతో రవితేజ తన కెరీర్‌లో ట్రావెల్ చేశాడు. అలాంటి వారిలో రమేశ్ వర్మ ఒకడు. రవితేజతో గతంలో ‘వీర’ అనే సినిమాను తెరకెక్కించాడు రమేశ్ వర్మ. బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలైంది. ఈ సినిమాతో రమేశ్ వర్మ కొన్నాళ్ళు కనిపించలేదు. మళ్ళీ చాన్నాళ్ళకు ‘రాక్షసుడు’ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో రమేశ్ వర్మ మళ్ళీ రవితేజ తో ‘ఖిలాడి’ చిత్రం తీసే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఈ సినిమాసైతం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయినా సరే రమేశ్ వర్మ టాలెంట్ పై రవితేజకు ఇంకా నమ్మకం పోలేదు.


తమ నటవారసుడ్ని రమేశ్ వర్మ చేతుల్లో పెట్టడానికి రవితేజ, ఆయన ఫ్యామిలీ రెడీ అయిందని సమాచారం. రవితేజ పెద్ద తమ్ముడు రఘు కొడుకు.. మాధవ్ హీరోగా తొలి ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్టింగ్, హార్స్ రైడింగ్, ఫైటింగ్ లాంటి విద్యల్లో అతడు నిష్ణాతుడయ్యాడట. మంచి టెక్నిల్ వేల్యూస్ తో, ప్రముఖ తారాగణంతో చిత్రాన్ని నిర్మించబోతున్నారని టాక్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకి రమేశ్ వర్మ కథ, మాటలు, స్ర్కీన్ ప్లే మాత్రమే అందిస్తున్నాడట. కొత్త దర్శకుడ్ని ఈసినిమాతో తెరకు పరిచయం చేయాలని రవితేజ్ ఆలోచనగా తెలుస్తోంది. దర్శకుడు ఎవరైనప్పటికీ మాధవ్ మొదటి సినిమా బాధ్యతను రవితేజ రమేశ్ వర్మకు అప్పగించడం గమనార్హం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

Updated Date - 2022-06-25T19:38:06+05:30 IST