Ramcharan : కిల్లర్ వర్కవుట్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-07-18T13:58:21+05:30 IST

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది.

Ramcharan : కిల్లర్ వర్కవుట్.. వీడియో వైరల్

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో అతడు నటించిన ‘వినయవిధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి అతడు అదే బాడీని మెయిన్ చేస్తూ వచ్చాడు. రీసెంట్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) లో అతడి ఫిజిక్కే అందుకు నిదర్శనం. ప్రస్తుతం చెర్రీ.. శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రామ్‌చరణ్ తన సూపర్ ఫిజిక్ తో అభిమానుల్ని అలరించబోతున్నాడు. దీని కోసం కిల్లర్ వర్కవుట్ చేస్తున్నట్టు ఒక వీడియో ద్వారా చెప్పాడు. ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్ (Rakesh Udiyar) పర్యవేక్షణలో చెర్రీ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.  


‘సన్ డే మార్నింగ్ కిల్లర్ వర్కవుట్ విత్ రాకేశ్ ఉడియార్’ (Sunday morning killer workout with Rakesh Udiyar) అనే కేప్షన్ ఇస్తూ అతడు వదిలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో చేయబోయే పాత్రతో పాటు అపీరెన్స్ కూడా చాలా ముఖ్యమని నమ్మే రామ్ చరణ్.. అభిమానుల కోసం తన బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకోవడం హాబీగా మార్చుకున్నాడు. షూటింగ్ టైమ్‌లో ఎలాంటి జంక్ ఫుడ్ ను దరిచేరనీయకుండా.. ఇంటినుంచి వచ్చిన ఫుడ్ ను మాత్రమే తినడం అలవాటుగా మార్చుకున్నాడు. RC 15 చిత్రంలో ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తుండడంతో.. దానికి తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నాడు. అందులో భాగంగానే జిమ్ లో కఠినతరమైన కసరత్తులు చేస్తున్నాడని వేరే చెప్పాలా? 


ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతోన్న RC15 చిత్రాన్ని దిల్ రాజు (Dilraju) నిర్మిస్తున్నారు. కాగా.. ఆయన నిర్మాణంలో ఇది 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Adwani) కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ నట దర్శకుడు యస్.జే సూర్య (SJ Surya) విలన్‌గా నటిస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. శంకర్ గతంలో చేసిన ‘ఒకేఒక్కడు’ (Oke Okkadu) చిత్రానికిది 2.0 వెర్షన్ అంటున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు సమాచారం. 



Updated Date - 2022-07-18T13:58:21+05:30 IST