Oscars Predictions 2023: బరిలోకి రామ్ చరణ్ కూడా..

ABN , First Publish Date - 2022-09-16T15:53:18+05:30 IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే..

Oscars Predictions 2023: బరిలోకి రామ్ చరణ్ కూడా..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. రామ్‌చరణ్, ఎన్‌టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం రూ.1100 కోట్ల పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. అనంతరం ఓటీటీలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంతోమంది హాలీవుడ్, ఇతర దేశాల సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. పలువురు ఈ మూవీని పొగుడుతూ ట్వీట్లు కూడా చేశారు. అంతేకాకుండా.. ఆస్కార్ 2023కి వెళ్లే నటీనటులు సినిమాల గురించి ప్రెడిక్ట్ చేస్తూ వెరైటీ అనే వెబ్‌సైట్ కొన్ని పేర్లను సూచించింది. అందులో ‘ఆర్ఆర్ఆర్(RRR)’ చిత్రానికి కూడా అవకాశం దక్కింది.


ముఖ్యంగా ఈ సినిమాలో కొమురం భీమ్‌గా నటించిన ఎన్‌టీఆర్‌(NTR) పేరు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌లో ఉండే అవకాశం ఉందని వెరైటీ ప్రెడిక్ట్ చేసింది. అంతేకాకుండా.. బెస్ట్ విదేశీ ఫిచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఎస్‌ఎస్ రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఓరిజినల్ సాంగ్‌ విభాగంలో ‘దోస్తీ’.. వంటి పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని వెరైటీ రాసుకొచ్చింది. తాజాగా ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్‌చరణ్ (Ramcharan) పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్‌సైట్ రాసింది. దాంతో ఆయన అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’, ‘రోబో’ వంటి పాన్ ఇండియా చిత్రాలకి వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ ట్వీట్ చేశాడు.


శ్రీనివాస్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు అభిమానులు రామ్‌చరణ్‌‌కి కచ్చితంగా ఆస్కార్స్‌కి నామినేట్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పైన చెప్పిన అన్ని విభాగాల్లో నామినేట్ అయ్యే అర్హత ‘ఆర్ఆర్ఆర్‌’కి ఉందని రాసుకొస్తున్నారు.



Updated Date - 2022-09-16T15:53:18+05:30 IST