‘రామన్న యూత్‌’ సందడి

ABN , First Publish Date - 2022-07-06T05:47:52+05:30 IST

అభయ్‌ బేతిగంటి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. రజినీ నిర్మాత....

‘రామన్న యూత్‌’ సందడి

అభయ్‌ బేతిగంటి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. రజినీ నిర్మాత. ఇటీవల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేశారు. ‘‘అభయ్‌ మంచి నటుడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. తనకు ఈ చిత్రం ఘన విజయాన్ని అందించాల’’ని ఆకాంక్షించారు. అభయ్‌ మాట్లాడుతూ ‘‘రొటీన్‌కి భిన్నమైన కథ ఇది. ఓ యువకుడు రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటాడు. ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. అందరినీ ఆలోచనలో పడేసే చిత్రమిద’’న్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తారు. సంగీతం: కమ్రాన్‌. 

Updated Date - 2022-07-06T05:47:52+05:30 IST