పోలీస్ కథలపై ఆసక్తి పోయింది : Ram Pothineni

ABN , First Publish Date - 2022-07-11T16:44:36+05:30 IST

మాస్ యాక్షన్ పోలీస్ కథలపై ఎవరికి ఆసక్తి ఉండదు? మాస్ ఇమేజ్ ఉన్న ప్రతీ హీరో తన కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ తొడిగి, ప్రత్యర్ధులపై లాఠీ ఝళిపించాలని భావిస్తాడు. హైఓల్టేజ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అంతకు మించిన ఆప్షన్ లేదు.

పోలీస్ కథలపై ఆసక్తి పోయింది : Ram Pothineni

మాస్ యాక్షన్ పోలీస్ కథలపై ఎవరికి ఆసక్తి ఉండదు? మాస్ ఇమేజ్ ఉన్న ప్రతీ హీరో తన కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ తొడిగి, ప్రత్యర్ధులపై లాఠీ ఝళిపించాలని భావిస్తాడు. హైఓల్టేజ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అంతకు మించిన ఆప్షన్ లేదు. అందుకే అందరు హీరోలకూ పోలీస్ పాత్ర అంటే మక్కువ ఎక్కువ. ఐతే రామ్ పోతినేని (Ram Pothineni) కి పోలీస్ కథలపై ఆసక్తి పోయిందట. అంతగా పోలీస్ స్టోరీలపై వ్యతిరేకత పెంచుకున్నాడట. ఇప్పుడు తాను పోలీస్ పాత్ర ధరించిన ‘ది వారియర్’ విషయంలోనూ విముఖతతోనే ఉన్నాడట. దానికి కారణం ఎవరు పోలీస్ కథను వినిపించినా అన్నీ ఒకేరకంగా ఉండడమేనట. ‘ది వారియర్’ (The Warrior) ప్రీరిలీజ్ ఈవెంట్ లో రామ్ తన మనసులోని మాటని ఇలా నిర్మొహమాటంగా బైట పెట్టాడు. 


తాను ‘ది వారియర్’ (The Warrior) సినిమా చేయడానికి ముందు ఐదు పోలీస్ కథలు వినగా.. అవన్నీ ఒకేలా ఉన్నాయని, అందుకే పోలీస్ స్టోరీ అంటేనే ఆసక్తి పోయిందని చెప్పాడు. అయితే దర్శకుడు లింగుసామి మాత్రం ఇదొక పోలీస్ కథ అని చెప్పకుండా.. తనకు నెరేషన్ ఇచ్చారని, తాను ఫార్మాలిటీ కోసమే ఆ కథ వినడానికి సిద్ధమయ్యానని, కానీ ఆయన చెప్పిన కథ విన్నాకా మతిపోయిందని, ఇలాంటి కథ కదా మనం చేయాల్సిందని రామ్ ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పాడు. తాను ఎప్పుడూ ఒక కథ వినగానే అలా ఫీలై ట్వీట్ చేసింది లేదని, కానీ ఈ సినిమా కోసం తాను అలా చేశానని చెప్పాడు రామ్. 


ఈ సినిమాలో సత్య పాత్రకోసం తాను రోజుకు రెండు సార్లు జిమ్ చేశానని, ఆ క్రమంలో తనకు గాయాలయ్యాయని, డాక్టర్ ను కలిస్తే, సినిమా ముఖ్యమా, జీవితం ముఖ్యమా అని ప్రశ్నించారని రామ్ గుర్తు చేసుకున్నాడు. ఐతే ఆ సమయంలో ట్విట్టర్ ఓపెన్ చేసి అభిమానుల మెసేజెస్ చదివితే వారి అన్ కండీషనల్ లవ్ తెలిసిందని, అభిమానులు లేకపోతే తాను లేనని తనకు అర్ధమైందని, రామ్ అన్నాడు. ఇంకా ఈ ఈవెంట్ లో దర్శకుడు లింగుసామి (Lingusamy) మాట్లాడుతూ.. రామ్ తో  తను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పడం విశేషం. రామ్ కు అదృష్టం ఉంటే అది జరుగుతుందని ఆయన తెలిపాడు.  

Updated Date - 2022-07-11T16:44:36+05:30 IST