Ram pothineni : ఆశలన్నీ బోయపాటి చిత్రంపైనే !

ABN , First Publish Date - 2022-08-01T20:26:38+05:30 IST

రామ్ పోతినేని (Ram Pothineni).. కెరీర్ బిగినింగ్ నుంచి లవర్ బోయ్ వేషాలే వేశాడు. అలా నటించిన సినిమాలన్నీ దాదాపుగా అతడికి మంచి మైలేజ్ ఇచ్చాయి. ఎప్పుడైతే పూరీ జగన్నాథ్ స్కూల్లో చేరాడో అప్పటినుంచి రామ్‌కు మాస్ ఇమేజ్ వచ్చిపడింది.

Ram pothineni : ఆశలన్నీ బోయపాటి చిత్రంపైనే !

రామ్ పోతినేని (Ram Pothineni).. కెరీర్ బిగినింగ్ నుంచి లవర్ బోయ్ వేషాలే వేశాడు. అలా నటించిన సినిమాలన్నీ దాదాపుగా అతడికి మంచి మైలేజ్ ఇచ్చాయి. ఎప్పుడైతే పూరీ జగన్నాథ్ స్కూల్లో చేరాడో అప్పటినుంచి రామ్‌కు మాస్ ఇమేజ్ వచ్చిపడింది. ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సూపర్ హిట్టవడంతో.. ఎనర్జిటిక్ స్టార్ మరింత ఎనర్జీతో పూర్తి స్థాయిలో తనలోని మాస్ హీరోని బైటికి తీయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రామ్ ‘రెడ్’ (Red) అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటించాడు. క్లాస్ అండ్ మాస్ పాత్రలతో ద్విపాత్రాభినయం చేసి.. ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయినా సరే రామ్‌కు యాక్షన్ చిత్రాలపై ఆసక్తి తగ్గలేదు. లింగుసామి ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ (The Warrior) తో మరో ప్రయత్నం చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఎమైందో తెలిసిందే. 


ప్రస్తుతం రామ్ పోతినేని తన ఆశలన్నిటీని బోయపాటి (Boyapati) దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోయే చిత్రంపైనే పెట్టుకున్నాడు. హీరోలకు హైఓల్టేజ్ ఇమేజ్ తెప్పించడంలో బోయపాటి దిట్ట అనే సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ స్టోరీస్‌కు పెట్టింది పేరైన ఆయన.. రామ్ హీరోగా ఒక అదిరిపోయే కథాంశాన్ని రాసుకున్నాడట. అల్లు అర్జున్ (Allu Arjun) ‘సరైనోడు’ (Sarainodu) తరహాలో.. సూపర్ ఎలివేషన్స్‌తో పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇంతకు ముందు ఓ సీనియర్ హీరోతో ‘అఖండ’ (Akhanda) అనే మూవీ తీసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి.. రామ్ పోతినేనితో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ విభిన్నమైన మేకోవర్ తో కనిపించబోతున్నాడు. 


వారియర్ నిర్మాత.. శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) ఈ సినిమాను నిర్మించబోతుండడం విశేషం. ‘వారియర్’, ఇంతకు ముందు నిర్మించిన ‘సీటీమార్‌’ (Seetimar) తో కూడా నష్టాలు రావడంతో..  కష్టాల్లో పడిన ఆయనకి హిట్టిచ్చే బాధ్యతను బోయపాటి తీసుకున్నారు. ఇటు రామ్, అటు నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఇద్దరూ బోయపాటిపైనే భారమంతా మోపారు. ‘అఖండ’ విజయోత్సాహంతో ఉన్న బోయపాటి.. రామ్‌కు ఎలాగైనా సరే హిట్టిచ్చి... తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నారు. రామ్ సైతం బోయపాటి సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో రామ్ హిట్టు గట్టెక్కితే.. మళ్ళీ హీరోగా రామ్ నిలబడిపోయినట్టే. 

Updated Date - 2022-08-01T20:26:38+05:30 IST