బాలీవుడ్ ను వివేక్ వుడ్ గా మార్చిన ‘కశ్మీర్ ఫైల్స్’

ABN , First Publish Date - 2022-03-16T22:29:09+05:30 IST

ఈ నెల 11న బాలీవుడ్ లో విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎంతో ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. 1990 లో కశ్మీర్ పండిట్లపై మిలిటెంట్ల ఊచకోత నేపథ్యంలో అత్యంత

బాలీవుడ్ ను వివేక్ వుడ్ గా మార్చిన ‘కశ్మీర్ ఫైల్స్’

ఈ నెల 11న బాలీవుడ్ లో విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎంతో ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. 1990 లో కశ్మీర్ పండిట్లపై మిలిటెంట్ల ఊచకోత నేపథ్యంలో అత్యంత సహజంగా రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవిజోషి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది.  అలాంటి ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని  హృదయపూర్వకంగా ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . 


‘‘వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఎంతో వివాదాస్పదమైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ధైర్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ పరిశ్రమను పక్కకు నెట్టేసి కొత్త రకం ఫిల్మ్ మేకర్స్ ను సృష్టించే విధంగా వివేక్ వుడ్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడం కంటే కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ రావడం అనేది ఎంతో గొప్ప విజయం’’ అంటూ వర్మ తనదైన శైలిలో వివేక్ అగ్రిహోత్రిని ఆకాశానికెత్తేశారు. అలాగే..  మరి కొన్ని ట్వీట్స్ తో ఈ సినిమాని, వివేక్ ను అదేపనిగా ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు వర్మ. 







Updated Date - 2022-03-16T22:29:09+05:30 IST