ఏపీ సర్కార్ సంగతేమో గానీ నాకైతే చలి జ్వరం వచ్చేసింది: వర్మ

ABN , First Publish Date - 2022-02-04T03:42:45+05:30 IST

‘ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది’.. అని ట్వీట్ చేశారు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పాత జీతాలు అడిగితే కొత్త వేతనాలు

ఏపీ సర్కార్ సంగతేమో గానీ నాకైతే చలి జ్వరం వచ్చేసింది: వర్మ

‘ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది’.. అని ట్వీట్ చేశారు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పాత జీతాలు అడిగితే కొత్త వేతనాలు వేయడం.. చర్చలకు పెట్టిన ఏ షరతునూ ఖాతరు చేయకపోవడం.. భయపడినట్టే కొత్త పీఆర్సీతో తగ్గిన జనవరి వేతనాలను డీఏలతో కవర్‌ చేసిన తొండి నేపథ్యంలో ఏపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి లక్షల్లో ఉద్యోగులు తరలిరావడంతో.. ఆ జన సందోహాన్ని చూసిన వర్మ పై విధంగా ట్వీట్ చేశారు.


‘‘సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాకు షాకిస్తోంది. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని నా సందేహం. A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది’’ అని.. ‘చలో విజయవాడ’కు సంబంధించిన ఫొటోలను రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘చలి జ్వరం అంటున్నావు.. కరోనా ఏమో టెస్ట్ చేయించుకో’.., ‘దీనిపై కూడా సినిమా ఏమైనా తీస్తావా?’ అని కొందరు, మీకు కష్టం వస్తే మాట్లాడడానికి చిరంజీవి ఉన్నాడు.. వాళ్లకి ఎవరూ లేరు.. అందుకే రోడ్డుపైకి వచ్చారు’ అని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇంకొందరైతే.. ‘‘ఒక చేతిలో మందు.. మరో చేతిలో అమ్మాయి ఉన్న నీకు మా బాధలు ఏం తెలుస్తాయి కానీ.. నీ సెటైర్లు ఆపు..’’ అంటూ కాస్త ఘాటుగా కూడా వర్మకు బదులిచ్చారు. 





Updated Date - 2022-02-04T03:42:45+05:30 IST