బాలీవుడ్‌పై Ram Gopal Varma సంచలన వ్యాఖ్యలు..ఆ ఇండస్ట్రీ ఓటీటీల కోసమే సినిమాలు తెరకెక్కించబోతుంది..

ABN , First Publish Date - 2022-05-13T22:23:19+05:30 IST

సమకాలీన అంశాలపై తరచు స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ‘పుష్ప’ (Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR), ‘కెజియఫ్: చాప్టర్-2’(K.G.F: Chapter 2) వంటి దక్షిణాది సినిమాలు

బాలీవుడ్‌పై  Ram Gopal Varma సంచలన వ్యాఖ్యలు..ఆ ఇండస్ట్రీ ఓటీటీల కోసమే సినిమాలు తెరకెక్కించబోతుంది..

సమకాలీన అంశాలపై తరచు స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ‘పుష్ప’ (Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR), ‘కెజియఫ్: చాప్టర్-2’(K.G.F: Chapter 2) లాంటి దక్షిణాది సినిమాలు సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై వరుసగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ‘కెజియఫ్-2’ లాంటి సినిమా నీడలో ఏ మొక్క కూడా పెరగడం లేదన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలన్నింటిని ఈ చిత్రం మింగేసిందన్నాడు. ‘కెజియఫ్’ బాలీవుడ్ వారికీ పీడకలలు మిగిల్చిందని, రీమేక్స్ కాకుండా మంచి కంటెంట్ నమ్ముకోవాలని సూచించాడు. తాజాగా మరోసారి ఈ స్టార్ డైరెక్టర్ బీ టౌన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘థియేటర్స్‌లో దక్షణాది సినిమాలు బంపర్ హిట్ కొట్టడం..ఉత్తరాది చిత్రాలు వసూళ్లను సాధించలేకపోవడం చూస్తుంటే .. బాలీవుడ్ త్వరలోనే ఓటీటీల కోసం మూవీస్ తెరకెక్కించే రోజులు రాబోతున్నాయి’’ అని ట్విట్టర్‌లో రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. 


కొన్ని రోజుల క్రితం కిచ్చా సుదీప్, అజయ్ దేవగణ్‌ల మధ్య కొనసాగిన హిందీ జాతీయ భాష వివాదంపై కూడా ఈ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ చేశాడు.‘‘కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కెజియఫ్-2’ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలకు దీటుగా తొలిరోజే రూ. 50కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో బీ టౌన్ హీరోలు కన్నడ స్టార్స్‌పై అసూయతో ఉన్నారు. రాబోయే రోజుల్లో బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఏవిధంగా ఉంటాయో చూద్దాం. కన్నడలో బంగారం ఉందా? లేదా బాలీవుడ్‌లో బంగారం ఉందా? అనేది ‘రన్ వే-34’ కలెక్షన్ల ద్వారా తెలుస్తుంది’’ అని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. తాజాగా మహేశ్ బాబు బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 



Updated Date - 2022-05-13T22:23:19+05:30 IST