‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వర్మ రియాక్షన్ ఇదే!.. పవన్ ఫ్యాన్స్ హర్ట్

ABN , First Publish Date - 2022-02-22T04:17:43+05:30 IST

అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా సినిమా అయితే.. ‘భీమ్లా నాయక్’ సినిమాని ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం లేదంటూ.. పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ.. వరసగా ట్వీట్స్ చేశారు. ఇలా ఎప్పుడూ..

‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వర్మ రియాక్షన్ ఇదే!.. పవన్ ఫ్యాన్స్ హర్ట్

తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. వర్మపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఈ ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్‌ని వర్మకి అనుకరిస్తూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. నిజంగానే వర్మకు అలా అనిపించిందో.. లేక పవన్ కల్యాన్ ఫ్యాన్స్‌ని ఈ టైమ్‌లో కెలికితే ఎలా ఉంటుందో చూడాలని ట్వీట్ చేశాడో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి వర్మ గురికాకతప్పడం లేదు.


వాస్తవానికి ఈ ట్రైలర్ చూస్తుంటే పవన్-రానా ఇద్దరికీ మంచి పవర్ ఫుల్ పాత్ర పడినట్లుగా ఒకరిని మించి ఒకరు.. పోటాపోటీగా నటించినట్లుగా తెలుస్తుంది. అయితే సినిమా పేరు మాత్రం పవన్ కల్యాణ్‌నే హైలెట్ చేసేలా మేకర్స్ పెట్టారు. టైటిల్ ప్రకటన వచ్చినప్పుడే.. ఇద్దరు హీరోలు నటించే చిత్రానికి ఒక్క హీరో పేరునే టైటిల్‌గా ఎలా నిర్ణయిస్తారంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. దానికి మేకర్స్ వివరణ కూడా ఇచ్చారు. టైటిల్ మాత్రమే అలా ఉంటుంది.. సినిమాలో మాత్రం ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఒరిజినల్‌లో కూడా హీరోలిద్దరి పేర్లు వచ్చేలా టైటిల్ ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ‘భీమ్లా నాయక్’గా టైటిల్‌ని ఖరారు చేశారు.


వర్మ విషయానికి వస్తే.. రీసెంట్‌గా కూడా ఈ సినిమాని ఉద్దేశించి వర్మ కొన్ని ట్వీట్స్ చేశారు. అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా సినిమా అయితే.. ‘భీమ్లా నాయక్’ సినిమాని ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం లేదంటూ.. పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ.. వరసగా ట్వీట్స్ చేశారు. ఇలా ఎప్పుడూ.. తన పేరు మీడియా మాధ్యమాలలో వినబడేందుకు పవన్ కల్యాణ్‌ పేరుని వర్మ వాడుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. పెద్ద అభిమానిని అంటూనే.. ఇలా తనకి అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్‌ని కించపరిచేలా వర్మ ట్వీట్స్ వేస్తుంటారు. దీనికి మెగాభిమానులు రియాక్ట్ అయ్యే విధానం చూస్తూ.. హాయిగా తనకి నచ్చింది తాగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడీ ఒకప్పటి క్రియేటివ్ దర్శకుడు. కాగా, సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 

Updated Date - 2022-02-22T04:17:43+05:30 IST