RGV: టాలీవుడ్ ఇలా అవడానికి కారణం రాజమౌళినే.. వర్మ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-03T18:50:32+05:30 IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా..

RGV: టాలీవుడ్ ఇలా అవడానికి కారణం రాజమౌళినే.. వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా.. తనరూటే సెపరేటు అంటాడు. ఏ అంశం గురించైనా అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ.. వాటి వల్ల కొన్ని విమర్శలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. అలాగే.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో హాట్ టాపిక్‌లపై తనదైనా శైలిలో పోస్టుల, ట్వీట్స్ చేస్తుంటాడు. టాలీవుడ్‌లో సినిమా నిర్మాతలు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చాలా సినిమాల షూటింగ్స్ అర్థాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్. ఈ టాపిక్‌ మీద కూడా తాజాగా ఓ ఇంటర్వ్వూలో వర్మ మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli)నే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


ఆ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ (Tollywood) ప్రస్తుతం పరిస్థితికి మూల కారణం ఒకే ఒక్క వ్యక్తి. అతని పేరు రాజమౌళి. ఆయన రెండు పనులు చేయడం వల్లే సిట్యువేషన్ ఇలా అయ్యింది. ఒకటి.. సినిమా బాగా తీస్తే వేల కోట్లు వస్తాయని ప్రూవ్ చేయడం. రెండు.. సినిమా క్వాలిటీ, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయడం. వాటి ముందు మిగిలిన సినిమాలు నిలవలేకపోతున్నాయి. దీంతో టాలీవుడ్‌లోని మిగిలిన టాప్  డైరెక్టర్స్ అందరూ ఆయన కంటే పెద్ద సినిమా తీయాలని అనుకుంటున్నారు. అందుకే సినిమాల బడ్జెట్ పెరిగింది’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ వీడియోకి లింక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి.. ‘థియేటర్ల ప్రాబ్లెమ్, ఓటీటీలు కాదు. అసలు శత్రువులు ఎస్ఎస్ రాజమౌళి, యూట్యూబ్’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అవును సర్ మీరు చెప్పింది అక్షరాలా నిజం’, ‘మీ అనాలసిస్‌ సూపర్ సర్. ఇలా ఆలోచించడం ఎవరి వల్ల కాదు’ అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-08-03T18:50:32+05:30 IST