Ram Charan: వినాయకుడిగా ఆకట్టుకుంటున్న రామ్‌చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా..

ABN , First Publish Date - 2022-08-30T21:46:57+05:30 IST

ఆర్ఆర్ఆర్ (RRR).. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదునెలలు గడిచింది. అయినప్పటికీ ఈ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోగా..

Ram Charan: వినాయకుడిగా ఆకట్టుకుంటున్న రామ్‌చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా..

ఆర్ఆర్ఆర్ (RRR).. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదునెలలు గడిచింది. అయినప్పటికీ ఈ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోగా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. ఆదివాసీ విప్లవ నాయకుడు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్(NTR), స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan) నటించారు. 


ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్ చేసిన రామరాజు క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. అది గణపతి చతుర్థికి సంబంధించిన ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితికి విగ్రహాలు పెట్టి పూజలు చేయడం తెలిసిందే. అయితే.. కొందరు విగ్రహాలను మాత్రం అప్పటి వరకూ బాగా పాపులారిటీ ఉన్న సినిమా తారలను పోలేలా తయారు చేస్తుంటారు. బాహుబలి సమయంలో శివలింగాన్ని ప్రభాస్ ఎత్తుకున్నట్లుగానే.. గణేషుడు శివలింగాన్ని ఎతుకున్నట్లు పలు విగ్రహాల పిక్స్ నెట్టింట హల్‌చల్ చేశాయి.


తాజాగా సైతం ఆర్ఆర్ఆర్‌లోని రామ్‌చరణ్‌ చేసిన పాత్ర రామరాజు లుక్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. దాంతో సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో  రామ్ చరణ్ లుక్‌ని పోలిన గణేష్ విగ్రహాలను దేశవ్యాప్తంగా పలువురు తయారు చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను రామ్‌చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. అది రామరాజు క్రేజ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా.. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాగా.. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు ఎడ్గార్ రైట్, జో రస్సో, జేమ్స్ గన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.









Updated Date - 2022-08-30T21:46:57+05:30 IST