Salman Khan సినిమాలో Ram Charan.. బాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్న న్యూస్..!

ABN , First Publish Date - 2022-06-21T21:14:36+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ అతిథి పాత్రలో నటించడం మామూలే. ఇప్పటికే చాలామంది అలా ఇతరుల సినిమాల్లో మెరిశారు...

Salman Khan సినిమాలో Ram Charan.. బాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్న న్యూస్..!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ అతిథి పాత్రలో నటించడం మామూలే. ఇప్పటికే చాలామంది అలా ఇతరుల సినిమాల్లో మెరిశారు. అయితే.. ఓ బాలీవుడ్ మూవీలో ఓ తెలుగు హీరో గెస్ట్‌గా చేయలేదనే చెప్పాలి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఓ టాలీవుడ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాళి’. ఈ మూవీ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నాడనేది ఆ వార్తా సారాంశం. ఆ సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చెర్రీ చిందేయనున్నాడని సమాచారం. ఆ పాటలో ఈ నటుల కెమిస్ట్రీ, వారి సిగ్నేచర్ మూవ్స్‌తో అదిరిపోతుందని తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్, అటు సల్లు భాయ్ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. హిందీ, తెలుగు స్టార్స్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఊవ్విళ్లూరుతున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ హీరో వెంకటేశ్, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ 3’ త్వరలో విడుదల కానుంది. అలాగే.. రామ్ చరణ్ సైతం తమిళ డైరెక్టర్ శంకర్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

Updated Date - 2022-06-21T21:14:36+05:30 IST