Ram Charan: సినీ ఇండస్ట్రీ కోసం రంగంలోకి మెగా పవర్ స్టార్

ABN , First Publish Date - 2022-07-28T23:05:37+05:30 IST

టాలీవుడ్‌ (Tollywood)లో ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని యాక్టివ్ టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫిల్మ్ నగర్‌లో గందరగోళం..

Ram Charan: సినీ ఇండస్ట్రీ కోసం రంగంలోకి మెగా పవర్ స్టార్

టాలీవుడ్‌ (Tollywood)లో ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని యాక్టివ్ టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫిల్మ్ నగర్‌లో గందరగోళం జరుగుతోంది. వరసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు కానీ ఏ విషయం తేల్చడం లేదు. అయితే ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటే సరిపోతుందా.. హీరోలు కూడా ఓకే అనాలి కదా!.. రెమ్యునరేషన్‌లో కోత పెట్టుకోవడానికి మన హీరోలు రెడీ అయినప్పుడే, సినిమా మేకింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun) రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకి వచ్చారు. మిగిలిన స్టార్ హీరోలని కూడా కూల్ చేస్తే, షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అయితే హీరోలతో మాట్లాడడం అంత ఈజీ విషయం కాదు, అందుకే ఈ పనిని చరణ్‌కి నిర్మాత దిల్ రాజు (Dil Raju) అప్పగించినట్లుగా తెలుస్తుంది.


రామ్ చరణ్‌కి మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas), రానా (Rana),  అఖిల్ (Akhil), చైతూ (Chaitu), శర్వానంద్ (Sharwanand), నాని (Nani) వంటి హీరోలతో మంచి రిలేషన్ ఉంది. మెగా ఫ్యామిలీలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), వరుణ్ తేజ్ (Varun Tej), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఉన్నారు. వీరిని ఒప్పించడం చరణ్‌కి పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. సో.. దిల్ రాజు ఇచ్చిన టాస్క్‌ని మెగా పవర్ స్టార్ చాలా ఈజీగానే కంప్లీట్ చేసేలా ఉన్నాడు. అలాగే, తన సర్కిల్‌లో ఉన్న హీరోలకి సర్ది చెప్పే బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి వస్తే, ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ముందుండి ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు. ఈసారి మెగాస్టార్ ప్లేస్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ పని చేయడానికి ముందుకి రావడంతో.. అతనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Updated Date - 2022-07-28T23:05:37+05:30 IST