Ram Charan: క్లారిటీ ఇవ్వకపోతే రూమర్సేగా మరి..!

ABN , First Publish Date - 2022-08-31T14:16:16+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కమిటవుతున్న చిత్రాలను కూడా అదే రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Ram Charan: క్లారిటీ ఇవ్వకపోతే రూమర్సేగా మరి..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కమిటవుతున్న చిత్రాలను కూడా అదే రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే, క్రియేటివ్ జీనియస్ శంకర్ (Shankar) దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు (Dil Raju) తన సంస్థలో నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. అంతేకాదు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి ప్రతిష్ఠాత్మక 50వ చిత్రం. అందుకే, దిల్ రాజు ఈ మూవీని బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.


కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా.. అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, ఆర్సీ 15 మొదలై దాదాపు 70 శాతం వరకూ చిత్రీకరణ పూర్తైంది. టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిపివేయడంతో శంకర్ ఇండియన్ 2ని మొదలు పెట్టారు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్దార్థ్, ప్రియ భవాని శంకర్ తదితరులు కీలక పాత్రల్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. 


అయితే, ఆర్సీ 15 షూటింగ్ ఆగిపోవడం..ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) సినిమాను ప్రకటించి ఇంకా మొదలు పెట్టకపోవడంతో, సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన రూమర్స్ వచ్చి హల్‌చల్ చేస్తున్నాయి. ఆర్సీ 15 మళ్ళీ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో క్లారిటీ లేదు. అలాగే, చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అప్‌డేట్ లేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, నెటిజన్స్ అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ కాకపోయినా చరణ్ అయినా తన చిత్రాల విషయంలో అప్‌డేట్స్ ఇస్తే బావుంటుంది.

Updated Date - 2022-08-31T14:16:16+05:30 IST