RC15: ఎస్‌జె సూర్య వస్తుంటే.. రామ్ చరణ్ వెళ్లిపోతున్నాడు

ABN , First Publish Date - 2022-09-09T23:06:14+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘RC15’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్‌తో..

RC15: ఎస్‌జె సూర్య వస్తుంటే.. రామ్ చరణ్ వెళ్లిపోతున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘RC15’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్‌తో శంకర్ చేస్తున్న ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం కూడా తిరిగి షూటింగ్ ప్రారంభించుకోవడంతో.. దర్శకుడు శంకర్.. ఇప్పుడు రెండు చిత్రాలకూ వర్క్ చేస్తున్నారు. ఒక నెల ఒక చిత్రం, ఇంకో నెల మరో చిత్రం అన్నట్లుగా ప్రస్తుతం శంకర్ పరిస్థితి ఉంది. అందుకే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా.. స్పీడుస్పీడుగా ‘RC15’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మాములుగా అయితే శంకర్ సినిమాలు చాలా స్లోగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. కానీ.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడంతో.. అటు ‘ఇండియన్ 2’ చిత్రాన్ని, ఇటు ‘RC15’ చిత్రాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. రీసెంట్‌గా ‘ఇండియన్ 2’ చిత్ర షెడ్యూల్ ముగించుకుని.. ‘RC15’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన శంకర్.. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోన్న ఎస్.జె. సూర్యకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. 


ఎస్.జె. సూర్య ‘RC15’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా చిత్రయూనిట్ కూడా అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అయితే ఎస్.జె. సూర్య (SJ Surya) సెట్స్‌లోకి వస్తుంటే.. చిత్ర హీరో రామ్ చరణ్ మాత్రం వీకెండ్ ఎంజాయ్ చేయడానికి.. తన పరివారంతో ఫ్లైట్‌లో బయలుదేరినట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో రామ్ చరణ్‌తో పాటు ఆయన సోదరీమణులు, మేనకోడళ్లు, తన పెట్ డాగ్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే.. రామ్ చరణ్ ఇలా వీకెండ్ ప్లానింగ్ ఏమిటా? అని అనుకుంటూ.. బహుశా ఈ షెడ్యూల్‌లో ఆయనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలేమీ లేవేమో అనేలా కామెంట్స్ మొదలయ్యాయి. ఒకవైపు సూర్య, మరోవైపు ఈ ఫ్లైట్ ఫొటోలను పెట్టి.. సూర్య వస్తుంటే.. చరణ్ వెళ్లిపోతున్నాడంటూ సోషల్ మీడియాలో సరదాగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

Updated Date - 2022-09-09T23:06:14+05:30 IST