Karthikeya 2: మూవీ టీంపై రామ్‌చరణ్ ప్రశంసలు.. స్పందించిన బాలీవుడ్ నటుడు

ABN , First Publish Date - 2022-08-28T17:58:20+05:30 IST

చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తున్న మూవీ ‘కార్తీకేయ 2 (Karthikeya 2)’. నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా నటించగా..

Karthikeya 2: మూవీ టీంపై రామ్‌చరణ్ ప్రశంసలు.. స్పందించిన బాలీవుడ్ నటుడు

చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తున్న మూవీ ‘కార్తీకేయ 2 (Karthikeya 2)’. నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా నటించగా 2014లో విడుదలై తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కార్తీకేయ’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో.. దేవుడ్ని నమ్మని ఓ యువ డాక్టర్ చేసే ద్వారకని వెతుకుతూ చేసే సాహసయాత్రే ఈ సినిమా. ఆగస్టు 12న విడుదలైన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతోంది.


అంతేకాకుండా.. బాలీవుడ్‌లో సైతం అక్కడి స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ వెనక్కి నెట్టి మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ యువ నటుడు రామ్‌చరణ్(Ram Charan) ఈ మూవీ టీంకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.


చరణ్ చేసిన ట్వీట్‌లో.. ‘మంచి చిత్రాలు ఎల్లప్పుడూ థియేటర్‌కు కీర్తిని తెస్తాయి! కార్తికేయ 2 భారీ విజయం సాధించినందుకు మొత్తం టీమ్‌కు అభినందనలు’ అని రాసుకొచ్చాడు. దానికి.. నిఖిల్, అనుపమ్ ఖేర్, అనుపమ పరమేశ్వరన్, చందు మొండేటి, నిర్మాత అభిషేక్‌ని ట్యాగ్ చేశాడు.


నిఖిల్‌తోపాటు ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్(Anupam Kher) కూడా చరణ్ ట్వీట్‌కి స్పందించాడు. అనుపమ్ ఖేర్ షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను మిత్రమా. హృదయపూర్వక శుభాకాంక్షలకు మీకు ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్‌లో మీ నటన నాకు చాలా నచ్చింది. జై హో!’ అంటూ రాసుకొచ్చాడు.


ఈ ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ.. ‘చరణ్ భాయ్.. మీ ప్రశంసలు నాతోపాటు మా కార్తీకేయ టీం మొత్తానికి చాలా సంతోషాన్ని కలిగించాయి. మాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి’ అని ఆనందాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా.. ఈ ట్వీట్‌కి ఆర్ఆర్ఆర్, అల్లూరి సీతా రామరాజు, కార్తీకేయ2 హిందీ అని ట్యాగ్ లైన్స్‌ని ఇచ్చాడు.







Updated Date - 2022-08-28T17:58:20+05:30 IST