RC15 : షార్ట్ టెంపర్ యువకుడిగా రామ్‌చరణ్ ?

ABN , First Publish Date - 2022-05-06T16:35:16+05:30 IST

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రం. RC15 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

RC15 : షార్ట్ టెంపర్ యువకుడిగా రామ్‌చరణ్ ?

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రం. RC15 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్‌కు ఏమీ కొదవలేదు. ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న RC15 ఇటీవల పంజాబ్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అందులో కొడుకు పాత్రకి షార్ట్ టెంపర్ ఉండనుందని, అతడి మేనరిజమ్స్, పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుందని సమాచారం. తండ్రి పాత్ర గ్రామీణ నేపథ్యంలోని పొలిటీషియన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇదివరకు RC15 చిత్రంలోని పొలిటీషియన్  పాత్రకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. సైకిల్‌పై పల్లెటూరు యువకుడిగా చెర్రీ రివీలయిన ఆ పిక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఒకేఒక్కడు’ తరహాలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే.. చెర్రీ తండ్రి పాత్రకు శ్రీకాంత్ స్నేహితుడని, తన మిత్రుడ్నే వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదుగుతాడని ఆ మధ్య కథనాలు వచ్చాయి. ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమా కథాంశంపై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో మెయిన్ విలన్‌గా యస్.జే సూర్య నటిస్తున్నట్టు, ‘ఐ’ తర్వాత మరోసారి నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను మలయాళ నటుడు సురేశ్ గోపీ చేస్తున్నట్టు తెలుస్తోంది. 


RC15 లో ఇంకా ఇషా గుప్త, అంజలి, అరవింద స్వామి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. నాయక్ చిత్రం తర్వాత చరణ్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తుండడంతో RC15పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘2.0’ చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తమన్ సంగీతం అందిస్తున్న RC15 .. చెర్రీకి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-06T16:35:16+05:30 IST