‘కండోమ్ టెస్టర్’గా Rakul Preet Singh!

ABN , First Publish Date - 2021-11-14T03:40:00+05:30 IST

టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ బాట పట్టిన రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో వెరైటీ సబ్జెక్ట్స్‌కే మొగ్గు చూపుతోంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మేడే, థాంక్ యూ, డాక్టర్ జి’ లాంటి ఢిపరెంట్ మూవీస్ ఉన్నాయి. అయితే, ఇప్పుడు మరోక సినిమా ఫస్ట్ లుక్‌తో రకుల్ ఒకింత షాక్ ఇచ్చింది!

‘ఛత్రీవాలీ’గా త్వరలో మన ముందుకు రాబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో విశేషం ఏంటంటే... ఆమె ఓ చిన్న పట్టణంలో ఉద్యోగం కోసం వెదికే యంగ్ గ్రాడ్యుయేట్‌గా కనిపించనుంది. ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేసే ఆ కెమిస్ట్రి స్టూడెంట్, చివరకు, ‘కండోమ్ టెస్టర్’గా సెటిలవుతుంది! అయితే ఆమె చేసే ‘అరుదైన ఉద్యోగం’ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. దాంతో ఆపైన ఎలాంటి కామెడీ ఫుట్టుకొచ్చిందనేదే ‘ఛత్రీవాలీ’ స్టోరీ! 

రకుల్ టైటిల్ రోల్‌లో తెరకెక్కుతోన్న ‘ఛత్రీవాలీ’ సినిమాకి తేజస్ విజయ్ దర్శకుడు. రోనీ స్క్రూవాలా నిర్మాత. ‘ఆర్ఎస్‌వీపీ’ బ్యానర్‌పై రూపుందుతోన్న ఈ సొషల్ కామెడీకి అసలు హైలైట్ హీరోయిన్ రకుల్ పొషించే ‘కండోమ్ టెస్టర్’ పాత్రే అంటున్నారు. ఆమె కండోమ్స్‌ని ఎలా టెస్ట్ చేస్తుంది... అన్నదే ఇప్పుడు సొషల్ మీడియాలో ఆసక్తికర చర్చగా మారింది!

Updated Date - 2021-11-14T03:40:00+05:30 IST