అప్పుడు జయసుధ, జయప్రద, శ్రీదేవి... ఇప్పుడు రకుల్

ABN , First Publish Date - 2021-10-11T00:11:19+05:30 IST

సౌత్ సినిమా అని, బాలీవుడ్ అని మనం మాట్లాడుకుంటాం. అలాగే, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, టాలీవుడ్ అంటూ చర్చించుకుంటాం. కానీ, హీరోయిన్స్ విషయానికి వస్తే అలాంటి సరిహధ్దులేవీ ఉండవు. అన్ని హద్దులు చెరిపేస్తూ ముద్దులు ఒలికిస్తుంటారు ముద్దుగుమ్మలు.

అప్పుడు జయసుధ, జయప్రద, శ్రీదేవి... ఇప్పుడు రకుల్

సౌత్ సినిమా అని, బాలీవుడ్ అని మనం మాట్లాడుకుంటాం. అలాగే, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, టాలీవుడ్ అంటూ చర్చించుకుంటాం. కానీ, హీరోయిన్స్ విషయానికి వస్తే అలాంటి సరిహధ్దులేవీ ఉండవు. అన్ని హద్దులు చెరిపేస్తూ ముద్దులు ఒలికిస్తుంటారు ముద్దుగుమ్మలు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఓ సినిమా రంగంలో సక్సెస్ సాధించి మరో ఇండస్ట్రీలో రొమాన్స్ నడిపేస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ మన రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించిన ఆమె బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసింది. తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ, టాలీవుడ్‌లో మాత్రమే రకుల్‌కి స్టార్‌డమ్ స్వంతమైంది. 



తెలుగులో మంచి గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. తన బర్త్ డే వేళ ప్రియుడి గురించి చెప్పిన ఢిల్లీ భామ, త్వరలో అతడ్నే భర్తగా పొందబోతోందట. రకుల్ పెళ్లి అంటూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. కాకపోతే తెలుగు తెరకు ఇలాంటి ముంబై పెళ్లిల్లు కొత్తేం కాదు... 



మన వాళ్లకు ‘అతిలోక సుందరి’గా ఆల్ టైం ఫేవరెట్ అయిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాతనే పెళ్లి చేసుకుంది. బోణీ కపూర్ ఇప్పటికీ బీ-టౌన్‌లో బిజీ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ‘వకీల్ సాబ్’‌తో తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. ఆమెతో పాటూ తెలుగు సినిమా రంగాన్ని దశాబ్దాల పాటూ ఏలిన జయసుధ, జయప్రద కూడా నిజ జీవితంలో ముంబై నిర్మాతల వైపే మొగ్గు చూపారు. జయసుధ భర్త నితిన్ కపూర్ హిందీ చిత్రాల నిర్మాతే కాదు, ప్రముఖ హీరో జితేంద్రకి, బంధువు కూడా. జయప్రద సైతం తెలుగులో ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ లెజెండ్రీ స్టేటస్ స్వంతం చేసుకున్నప్పటికీ, బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాను, 1989లో వివాహమాడారు. 


తెలుగు ప్రేక్షకుల మదులు దోచుకుని బాలీవుడ్ నిర్మాతలతో మూడు ముళ్ల వేయించుకున్న హీరోయిన్స్ లిస్టులో ఇప్పుడు రకుల్ కూడా చేరనుంది. అయితే, జాకీ భగ్నానీతో ఆమె పెళ్లి ఎప్పుడో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే! 



Updated Date - 2021-10-11T00:11:19+05:30 IST