Rakhi Sawant: షెర్లిన్ అలాంటి వీడియోలు తీసి సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది!

ABN , First Publish Date - 2022-11-04T19:58:43+05:30 IST

బిగ్‌బాస్ 16 (Bigg Boss 16) చుట్టూ అలుముకున్న వివాదాల గురించి తెలిసిందే. ఆ షోలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సాజిద్ ఖాన్..

Rakhi Sawant: షెర్లిన్ అలాంటి వీడియోలు తీసి సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది!

బిగ్‌బాస్ 16 (Bigg Boss 16) చుట్టూ అలుముకున్న వివాదాల గురించి తెలిసిందే. ఆ షోలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సాజిద్ ఖాన్ (Sajid Khan) ఎంట్రీతో షో మీద విమర్శలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ షో ప్రారంభమైన తర్వాత ఎంతోమంది బాలీవుడ్ నటిమణులు సాజిద్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.


అయితే.. అందరికీ విరుద్ధంగా రాఖీ సావంత్ ‘(Rakhi Sawant) మాత్రం సాజిద్‌కి సపోర్టు చేసింది. ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘సాజిద్ ఇప్పటికే చాలా అనుభవించాడు. చాలా అవకాశాలు కోల్పోయాడు. అతనికి సరైన శిక్ష పడింది. ఇంకా ఇలాగే అందరు విమర్శలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. కాబట్టి అతన్ని వదిలేయండి’ అని రాఖీ చెప్పుకొచ్చింది. దీనిపై మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా స్పందిస్తూ రాఖీపై విమర్శలు చేసింది. దానికి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యింది. అందులో రాఖీ సావంత్‌ని షెర్లిన్ ఇమిటేట్ చేసింది. ‘ఏం మాట్లాడుతున్నావు. జిమ్‌కు వెళ్లి కండలు పెంచు. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్స్ అందరు నీతో టైమ్ పాస్ చేసి వెళ్లిపోతారు. నీకు పని చేయడం కంటే 24 గంటలు మీడియా ముందు ఉండడమే ఇష్టం కదా’ అంటూ షెర్లిన్ వెటకారంగా మాట్లాడింది. దీనికి తాజాగా రాఖీ సావంత్ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో.. రాఖీ తన ఫోన్‌లోని షెర్లిన్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను చూపించింది. వాటి గురించి మాట్లాడుతూ.. ‘ఇది చూడండి, షెర్లిన్ చోప్రా ఒక పోర్న్ స్టార్. ఆమె అలాంటి చిత్రాలు, సెడక్టివ్ వీడియోలలో మాత్రమే కనిపిస్తుంది. ఆమె సెక్టార్షన్ రాకెట్‌ను నడుపుతుంది. ఎంతోమందితో అలాంటి వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఒకసారి అలీబాగ్‌లోని వ్యభిచార రాకెట్‌లో షెర్లిన్ దొరికిపోయింది. అయినా వారిని కూడా ప్రలోభపెట్టి తరచుగా డబ్బు వసూలు చేస్తుంది. తల నుంచి కాలి వరకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె నా గురించి మాట్లాడుతోంది’ అని రాఖీ అదే స్థాయిలో రిప్లై ఇచ్చింది. దీనికి షెర్లిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.



Updated Date - 2022-11-04T19:58:43+05:30 IST