మాఫియా డాన్‌గా Rajasekhar ?

ABN , First Publish Date - 2022-05-17T21:49:30+05:30 IST

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajasekhar) ప్రస్తుతం జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ (Shekar) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయనుంది. తదుపరిగా రాజశేఖర్ ఏ చిత్రంలో నటించబోతున్నారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ‘గరుడవేగ, కల్కి, శేఖర్’ చిత్రాల్లో వరుసగా ఆయన పోలీసు పాత్రలు చేశారు. దాంతో నెక్స్ట్ మూవీలో కూడా ఆయన మళ్ళీ అదే పోషిస్తారని అనుకుంటే పొరపాటే.

మాఫియా డాన్‌గా Rajasekhar ?

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajasekhar) ప్రస్తుతం జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ (Shekar) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయనుంది. తదుపరిగా రాజశేఖర్ ఏ చిత్రంలో నటించబోతున్నారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ‘గరుడవేగ, కల్కి, శేఖర్’ చిత్రాల్లో వరుసగా ఆయన పోలీసు పాత్రలు చేశారు. దాంతో నెక్స్ట్ మూవీలో కూడా ఆయన మళ్ళీ అదే పోషిస్తారని అనుకుంటే పొరపాటే. రాజశేఖర్ ( Rajasekhar) తదుపరి చిత్రం కోసం రూట్ మార్చుతున్నారు. ఈ సారి ఆయన మాఫియా డాన్‌ (Mafia don )గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో ‘ఆహుతి, గెడ్డం గ్యాంగ్’ లాంటి సినిమాల్లో ఆయన మాఫియా డాన్ పాత్రల్నే పోషించారు. ఇప్పుడు మరోసారి ఆయన అదే పాత్ర పోషించనుండడం విశేషమని చెప్పాలి. 


‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి’ లాంటి సినిమాలతో తన టాలెంట్ ఎటువంటిదో నిరూపించుకున్నాడు దర్శకుడు పవన్ సాధినేని (Pawan Sadhineni). ఇటీవల రాజశేఖర్‌ను కలిసిన పవన్ ఆయనకి అదిరిపోయే కథ చెప్పాడట. రాజశేఖర్ తన కెరీర్ లో అలాంటి విభిన్నమైన పాత్రను చేయకపోవడంతో.. వెంటనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరి కలయిలో త్వరలోనే ఓ స్టైలిష్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. కథ ఇప్పటికే సిద్ధమవడంతో అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. అన్ని రకాల ఎలిమెంట్స్ ను కథలో మెళవించిన దర్శకుడు.. ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణలో ఉన్నారు. మరి మాఫియా డాన్ గా రాజశేఖర్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 

Updated Date - 2022-05-17T21:49:30+05:30 IST