ట్రాన్స్ జెండర్ పాత్రను ట్రాన్స్ జెండరే పోషించాల్సిన అవసరం లేదు: Rajpal Yadav

ABN , First Publish Date - 2022-06-03T23:45:20+05:30 IST

సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav). తాజాగా ‘అర్ధ్’ (Ardh) సినిమాలో నటించాడు. పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో

ట్రాన్స్ జెండర్ పాత్రను ట్రాన్స్ జెండరే పోషించాల్సిన అవసరం లేదు: Rajpal Yadav

సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav). తాజాగా ‘అర్ధ్’ (Ardh) సినిమాలో నటించాడు. పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో రాజ్‌పాల్ ట్రాన్స్ జెండర్‌ పాత్రను పోషించాడు. ఈ పాత్రలను ట్రాన్స్ జెండర్సే పోషించాల్సిన అవసరం లేదని చెప్పాడు. 


రైతు జీవితం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఆ పాత్రను నిజమైన రైతే పోషించాల్సిన అవసరం లేదని రాజ్‌పాల్ యాదవ్ తెలిపాడు. అందుకే ‘అర్ధ్’ లో ట్రాన్స్ జెండర్ పాత్రను చేశానన్నాడు. తండ్రి, భర్త, థియేటర్ నటుడి పాత్రలను కూడా వారే చేయాల్సిన అవసరం లేదన్నాడు. ‘‘నటుడు ఎటువంటి పాత్రను అయినా చేయడానికీ సిద్దంగా చేయాలి. పాత్రలో మమేకమై ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలి. నటుడు అనేవాడు రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందాలి. కానీ, ఏ సినిమా అయిన సరే ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అని గుర్తుంచుకోవాలి. ఓ పాత్రకు సంబంధించిన అనేక లేయర్స్ నటుడిలో ఉంటేనే అప్పుడు మాత్రమే న్యాయం చేయగలడు’’ అని రాజ్‌పాల్ యాదవ్ తెలిపాడు. ‘అర్ధ్’ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జీ-5’లో జూన్ 10నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - 2022-06-03T23:45:20+05:30 IST