‘Honeymoon package’ : బాలీవుడ్ హీరో పేరు చెప్పి 3 కోట్ల మోసం!

ABN , First Publish Date - 2022-01-06T21:54:00+05:30 IST

లక్షలు కాదు... కోట్లు... ఏకంగా మూడు కోట్లు కాజేయాలనుకున్నారు మోసగాళ్లు. అదీ బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ పేరు చెప్పి భారీ దోపిడీకి సిద్ధమయ్యారు. కానీ, తన పేరు మీద చెలామణి అవుతోన్న డేంజరస్ ఈమెయిల్ బీ-టౌన్ హీరో కళ్లలో తొందరగానే పడింది. వెంటనే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో జనాల్ని హెచ్చరించాడు.

‘Honeymoon package’ : బాలీవుడ్ హీరో పేరు చెప్పి 3 కోట్ల మోసం!

లక్షలు కాదు... కోట్లు... ఏకంగా మూడు కోట్లు కాజేయాలనుకున్నారు మోసగాళ్లు. అదీ బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ పేరు చెప్పి భారీ దోపిడీకి సిద్ధమయ్యారు. కానీ, తన పేరు మీద చెలామణి అవుతోన్న డేంజరస్ ఈమెయిల్ బీ-టౌన్ హీరో కళ్లలో తొందరగానే పడింది. వెంటనే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో జనాల్ని హెచ్చరించాడు. 


తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఫేక్ ఈమెయిల్ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసిన రాజ్‌కుమార్ రావ్ ‘‘దొంగలతో జాగ్రత్తగా ఉండండి. నాకు ‘సౌమ్య’ అనే పేరున్న వారెవరూ తెలియదు’’ అంటూ హెచ్చరిక చేశాడు. ‘‘వాళ్లు దొంగ ఈమెయిల్ ఐడీల్ని, మ్యానేజర్లని వాడుకుని జనాల్ని మోసం చేస్తున్నారు’’ అని కూడా రాజ్‌కుమార్ చెప్పాడు. 


రాజ్‌కుమార్ రావ్ షేర్ చేసిన ఫేక్ ఈమెయిల్‌లో ‘హనీమూన్ ప్యాకేజ్’ అనే సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్ ఒప్పుకున్నట్టుగా రాసి ఉంది. రాజ్‌కుమార్ రావ్ తన మ్యానేజర్ పేరు ‘సౌమ్య’ అని కూడా అందులో చెప్పినట్టుగా ఫేక్ మెయిల్‌లో ఉంది. హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో కథ చర్చలు జరుపుదామని కూడా ఈమెయిల్‌లో రాజ్‌కుమార్ అన్నాడు! అవన్నీ పచ్చి అబద్ధాలని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాజ్‌కుమార్ రావ్ తేల్చి చెప్పాడు. మరి ఇంతకు... ఆ ఈమెయిల్ సృష్టించింది ఎవరు? రాజ్‌కుమార్ రావ్ కూడా దీనికి సమాధనం ఇవ్వలేదు. ‘వాళ్లు’ ఎవరో బహుశా ఆయనకి కూడా తెలియదేమో. కానీ, తన పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా మోసపోవద్దని మాత్రం రావ్ అంటున్నాడు. 


కొన్నాళ్ల క్రితం తన లాంగ్ టైం గాళ్‌ఫ్రెండ్ పత్రలేఖని వివాహమాడిన రాజ్‌కుమార్ రావ్ ‘హనీమూన్ ప్యాకేజ్’ సినిమా అయితే చేయటం లేదు కానీ... ‘బీడ్, బదాయి దో, మిష్టర్ అండ్ మిసెస్ మాహీ’ లాంటి చిత్రాల్లో కనిపించబోతున్నాడు.

Updated Date - 2022-01-06T21:54:00+05:30 IST