సార్.. మా అమ్మ మీకు వీరాభిమాని.. చనిపోయింది.. అని రాత్రి పూట Amitabhకు ఆమె కొడుకు ఫోన్ చేస్తే..

ABN , First Publish Date - 2021-10-30T16:37:58+05:30 IST

బాలీవుడ్ తెరపై మెగాస్టార్‌గా వెలిగి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్.

సార్.. మా అమ్మ మీకు వీరాభిమాని.. చనిపోయింది.. అని రాత్రి పూట Amitabhకు ఆమె కొడుకు ఫోన్ చేస్తే..

బాలీవుడ్ తెరపై మెగాస్టార్‌గా వెలిగి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్. ఎంతో మంది అమితాబ్‌ను స్ఫూర్తిగా తీసుకుని నటులుగా ఎదిగారు. అమితాబ్ ప్రస్తుతం బుల్లితెరపై `కౌన్ బనేగా కరోడ్ పతి` కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 13వ సీజన్ జరుగుతోంది. తాజాగా ఎపిసోడ్‌కు బాలీవుడ్ ప్రముఖ నటులు రాజ్‌కుమార్ రావ్, కృతి సనోన్ వచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ రావ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు 


`మా అమ్మగారు అమితాబ్‌కు వీరాభిమాని. ఆమె తన పెళ్లి తర్వాత పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక వస్తువు అమితాబ్ పోస్టర్. ఆ పోస్టర్‌ను ఆమె తన బెడ్రూమ్‌లో అంటించింది. అది చూసి మా నాన్న చాలా అభద్రతగా ఫీలయ్యేవారట. `నీకు నా కంటే అమితాబ్ అంటేనే ఇష్టమా` అని అమ్మను అడిగేవారట. నేను నటుడిగా మారిన తర్వాత ఆమె ఎప్పుడూ ఒకటే నన్ను అడిగేది. ఒకసారి అమితాబ్‌తో మాట్లాడించు అని అడిగేది. నాకు కుదరలేదు. 


ఒకరోజు నేను షూటింగ్‌లో ఉండగా మా చనిపోయినట్టు ఫోన్ వచ్చింది. అప్పుడు నాకు మీరే గుర్తుకువచ్చారు. మీకు వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పి ఆమె కోసం ఓ వీడియో బైట్ పంపమని అడిగా. మీరు వెంటనే ఆ బైట్ పంపారు. ఆ వీడియోను ఆమె ఫొటో ఎదురుగా ఉంచి ప్లే చేశా. అప్పుడు నాకు కొంచెం సంతృప్తిగా అనిపించింది. అయితే కొద్ది రోజులకు ఆ పెన్ డ్రైవ్‌లో ఉన్న వీడియో డిలీట్ అయిపోయింది. ఆ వీడియోలో మీరు ఏం చెప్పారో.. మీకు, ఆమెకు మాత్రమే తెలుసు. నేను కూడా ఆ వీడియో చూడలేద`ని రాజ్‌కుమార్ రావ్ చెప్పాడు. 

Updated Date - 2021-10-30T16:37:58+05:30 IST