Beast దర్శకుడికి ఊహించని షాక్.. సినిమా రిజల్ట్ చూసి మనసు మార్చుకున్న Rajinikanth..!?

ABN , First Publish Date - 2022-04-19T23:47:01+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండేది దేనికి? క్రియేటివిటి, గ్లామర్ వగైరా వగైరా కాదు! ‘సక్సెస్’కి మాత్రమే ఫిల్మీ దునియాలో ఆల్ టైం గిరాకీ ఉంటుంది. ఆ విజయం దక్కినప్పుడు ‘ఆహా’ అన్నవాళ్లే... అపజయం ఎదురైనప్పుడు ‘ఊహూ’ అనేస్తుంటారు...

Beast దర్శకుడికి ఊహించని షాక్.. సినిమా రిజల్ట్ చూసి మనసు మార్చుకున్న Rajinikanth..!?

సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండేది దేనికి? క్రియేటివిటి, గ్లామర్ వగైరా వగైరా కాదు! ‘సక్సెస్’కి మాత్రమే ఫిల్మీ దునియాలో ఆల్ టైం గిరాకీ ఉంటుంది. ఆ విజయం దక్కినప్పుడు ‘ఆహా’ అన్నవాళ్లే... అపజయం ఎదురైనప్పుడు ‘ఊహూ’ అనేస్తుంటారు. ఈ సత్యం బోధపడే సమయం తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఇప్పుడు వచ్చిందా? అవుననే అంటున్నారు గాసిపర్స్!


‘బీస్ట్’ సినిమాతో కోలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోదాం అనుకున్నాడు నెల్సన్. గతంలో ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసినప్పటికీ ఇలయదళపతి విజయ్ లాంటి టాప్ స్టార్‌తో సినిమా చేయటం నిజంగా పెద్ద అచీవ్‌మెంటే. దాన్ని ‘బీస్ట్’ చిత్రం ద్వారా సాధించాడు నెల్సన్. కానీ, తీరా విజయ్, పూజా హెగ్డే స్టారర్ బాక్సాఫీస్ వద్దకొచ్చాక రివ్యూస్ దారుణంగా బయలుదేరాయి. సినిమా అస్సలు బాలేదంటూ విమర్శకులు ఏకీ పారేశారు. సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్స్ వైపు వెళ్లటం లేదు. విజయ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా సినిమాని ఆడించే పనిలో ఉన్నారు!


‘బీస్ట్’ బీభత్సమైన నెగటివ్ టాక్‌కి కేవలం నెల్సనే కారణమంటూ చెన్నైలో జోరుగా టాక్ నడుస్తోంది. సినిమాని సరైన కథ, కథనం లేకుండా చుట్టేశాడని విమర్శలొస్తున్నాయి. ఆ క్రమంలోనే మరో బాంబు లాంటి పుకారు ప్రస్తుతం ప్రచారం అవుతోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ రజనీకాంత్‌తో. ‘తలైవర్ 169’గా తెరకెక్కనుంది. సన్ పిక్చర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. కానీ, ‘బీస్ట్’ ప్రత్యేక షోని తిలకించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చాడట. నెల్సన్ పనితీరు ఆయనకు అస్సలు నచ్చలేదట. దాంతో తన తరువాతి చిత్రానికి దర్శకుడ్ని మార్చేయమని నిర్మాతలకి చెప్పినట్టు సమాచారం!


రజనీకాంత్ సినిమా నుంచీ నెల్సన్‌ని తప్పించారనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. అటు నిర్మాతలుగానీ, ఇటు డైరెక్టర్‌గానీ కొత్తగా అనౌన్స్‌మెంట్ ఏదీ చేయలేదు. అంటే... ‘తలైవర్ 169’ సినిమాకి ఇంకా నెల్సన్నే దర్శకుడిగా భావించాలి. లెట్స్ సీ... ‘బీస్ట్’ ఎఫెక్ట్ రజనీకాంత్‌పై ఎంత వరకూ పడి ఉంటుందో. నెల్సన్ విషయంలో సూపర్ స్టార్ కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారో లేదో... 

Updated Date - 2022-04-19T23:47:01+05:30 IST