Rajanikanth చేతులమీదుగా చెస్‌ ఒలింపియాడ్‌ టీజర్‌!

ABN , First Publish Date - 2022-07-16T18:35:17+05:30 IST

రష్యాలో జరగాల్సిన 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌కు ఈ సారి తమిళనాడు వేదిక కానుంది. చెన్నై సమీపంలోని మమల్లాపురంలో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ నెల 28 నుంచి ఆగస్ట్‌ 10 వరకూ జరగనున్న ఈ పోటీలకు దేశవిదేశాల రాజులు, రాణులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ఆహ్వానం పలుకుతూ ఓ టీజర్‌ సిద్ధం చేయించారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ టీజర్‌ను శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు.

Rajanikanth చేతులమీదుగా చెస్‌ ఒలింపియాడ్‌ టీజర్‌!

రష్యాలో జరగాల్సిన 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌కు ఈ సారి తమిళనాడు వేదిక కానుంది. చెన్నై సమీపంలోని మమల్లాపురంలో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ నెల 28 నుంచి ఆగస్ట్‌ 10 వరకూ జరగనున్న ఈ పోటీలకు దేశవిదేశాల రాజులు, రాణులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ఆహ్వానం పలుకుతూ ఓ టీజర్‌ సిద్ధం చేయించారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth)ఈ టీజర్‌ను శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. ‘నమ్మ ఓరు చెన్నై’ అంటూ సాగే ఈ టీజర్‌కు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ (A r rehman) స్వరకర్త. ఈ వీడియోలో సీఎం స్టాలిన్‌, ఏ.ఆర్‌.రెహమాన్‌తోపాటు డాన్సర్లు సందడి చేశారు. బ్యాగ్రౌండ్‌లో చెస్‌ బోర్డ్‌ ప్లే అయ్యేలా చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Rajinikanth launch teaser for Chess Olympiad)






Updated Date - 2022-07-16T18:35:17+05:30 IST