Vikram: కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో..!

ABN , First Publish Date - 2022-05-30T01:36:01+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత లెజండరీ హీరోస్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. వారిద్దరిని ‘విక్రమ్’ (Vikram) చిత్రం ఒక చోటికి చేర్చింది. కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు

Vikram: కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో..!

చాలా గ్యాప్ తర్వాత లెజండరీ హీరోస్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. వారిద్దరిని ‘విక్రమ్’ (Vikram) చిత్రం ఒక చోటికి చేర్చింది. కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’. కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil)  ప్రధాన పాత్రలలో నటించగా.. మరో స్టార్ హీరో సూర్య (Suriya) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘విక్రమ్’ యూనిట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. అందుకోసం కమల్‌ హాసన్‌ని, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. వారిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘విక్రమ్’ సినిమా విషయానికి వస్తే.. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌, మత్తుగ మత్తుగ లిరికల్ సాంగ్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. అందులోనూ లోకేష్ కనగరాజ్ గత చిత్రాలన్నీ పెద్ద హిట్ సాధించడంతో.. ఈ చిత్రంపై భారీగా క్రేజ్ ఏర్పడింది. క్రేజ్ తగినట్లుగా ప్రొమోషన్ కార్యక్రమాలను కూడా చిత్రయూనిట్ నిర్వహిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా.. తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి నిర్మించడం విశేషం. స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ (Girish Gangadharan) సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ (Philomin Raj) ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని  స్టార్ హీరో నితిన్‌ (Nithiin) హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ (Sreshth Movies)  భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలుగుకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను మే 31న హైదరాబాద్, శిల్పకళావేదికపై నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2022-05-30T01:36:01+05:30 IST