shekar : సెన్సార్ పూర్తి

ABN , First Publish Date - 2022-05-18T19:31:39+05:30 IST

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) తాజా చిత్రం ‘శేఖర్’ (shekar). జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

shekar :  సెన్సార్ పూర్తి

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) తాజా చిత్రం ‘శేఖర్’ (shekar). జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శేఖర్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ (Joseph) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘విచిత్రన్’ (Visithiran) పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక ‘శేఖర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు సెన్సార్ సభ్యులు. విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. 


‘శేఖర్’ (shekar) చిత్రానికి టాలీవుడ్‌లో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ‘గరుడవేగ’ (Garudavega) మళ్ళీ హిట్ అందుకోలేకపోయిన రాజశేఖర్ (Rajasekhar)కు ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పోలీసులకు సవాల్ గా మారిన యాక్సిడెంట్ కేసుల్ని ఛేదించడానికి రిటైర్డ్ పోలీసాఫీసర్ (Retired Police Officer) శేఖర్ (shekar) బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు, తెలుసుకున్న నిజాలు ఏంటనేది సినిమాకి కీలకం. ఈ నేపథ్యంలో శేఖర్ తీసుకొన్న నిర్ణయం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అలాగే.. ఆ కేసు విషయంలో భార్యా, కూతుళ్ళ ప్రమేయం ఏంటన్నది మిగతా కథ. రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో రాజశేఖర్ ఈ  మూవీతో  ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి. 



Updated Date - 2022-05-18T19:31:39+05:30 IST