Shekar: సమస్య తీరినట్లేనా?

ABN , First Publish Date - 2022-05-24T02:30:06+05:30 IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) హీరోగా నటించిన ‘శేఖర్’ (Shekar) చిత్రం మే 20న విడుదలై పాజిటివ్ టాక్‪ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలైన రెండో రోజే ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆపేయడంతో..

Shekar: సమస్య తీరినట్లేనా?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) హీరోగా నటించిన ‘శేఖర్’ (Shekar) చిత్రం మే 20న విడుదలై పాజిటివ్ టాక్‪ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలైన రెండో రోజే ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆపేయడంతో అంతా షాకయ్యారు. దీనికి కారణం.. ఈ సినిమా నిర్మాణం నిమిత్తం దర్శకురాలు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) రూ. 64 లక్షలు తన వద్ద తీసుకుని.. సినిమా విడుదలైనా కూడా ఇవ్వలేదని ఫైనాన్షియర్ ఏ. పరంధామరెడ్డి (Parandhama Reddy) కోర్టును ఆశ్రయించారు. అనంతరం 48 గంటల్లో రూ. 64 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయకపోతే.. అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోర్టు ఆర్డర్ వేసినట్లుగా పరంధామ రెడ్డి.. ఓ నోటీసును విడుదల చేశారు. అయితే జీవిత ఆ అమౌంట్‪ను కట్టకపోవడంతో.. ఆదివారం సాయంత్రం నుండి థియేటర్లలో ‘శేఖర్’ సినిమాని నిలిపివేశారు. 


దీంతో అలెర్ట్ అయిన ‘శేఖర్’ చిత్ర టీమ్ కూడా కోర్టుని ఆశ్రయించగా.. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి (Beeram Sudhakar Reddy) తరపు న్యాయవాదులు మంగళవారం మీడియాకు వివరించనున్నారు. ‘‘కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని.. సినిమా ప్రదర్శనకు  కోర్టు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని.. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు’’ అనేలా ‘శేఖర్’ చిత్ర టీమ్ తరపు న్యాయవాదులు మీడియా ద్వారా తెలపబోతున్నట్లుగా సమాచారం. 


మరి ఈ మీడియా సమావేశం తర్వాతైనా.. ‘శేఖర్’ సమస్య తీరి.. మళ్లీ మాములుగానే థియేటర్లలో సినిమా సందడి చేసే అవకాశం ఉందనేలా.. ప్రస్తుతం టాలీవుడ్‪లో టాక్ నడుస్తుంది. ఏ విషయం రేపు (మంగళవారం) మీడియా సమావేశం తర్వాత తెలుస్తుంది.. అప్పటి వరకు ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరుగుతుందో.. వేచి చూడక తప్పదు. కాగా, వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై.. జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Updated Date - 2022-05-24T02:30:06+05:30 IST