Jailer : లాంచింగ్ ముహూర్తం అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-07-21T21:38:30+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) 169వ చిత్రం.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో ఖాయమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడడమే కాకుండా, ‘జైలర్’ (Jailer) అనే టైటిల్‌ను కూడా కన్ఫర్మ్ చేశారు.

Jailer : లాంచింగ్ ముహూర్తం అప్పుడేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) 169వ చిత్రం.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో ఖాయమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడడమే కాకుండా,  ‘జైలర్’ (Jailer) అనే టైటిల్‌ను కూడా కన్ఫర్మ్ చేశారు. రజనీ గత చిత్రం ‘అన్నాత్తే’ (Annathe) (తెలుగులో పెద్దన్న) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో   దర్శకుడు నెల్సన్‌తో తనకు సంతృప్తినిచ్చేంత వరకూ కథా చర్చలు జరిపి.. స్ర్కిప్ట్ పక్కగా రూపొందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట తలైవా. ‘కోలమావు కోకిల, డాక్టర్ , బీస్ట్’ చిత్రాలతో బ్లాక్ కామెడీ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్.. ఈ సినిమాను కూడా వాటి స్థాయిలోనే కామెడీ, థ్లిల్లింగ్ అంశాలతో తెరకెక్కించబోతున్నట్టు వినికిడి.  


ఇక ‘జైలర్’ సినిమాకు మంచి తేదీలో లాంచింగ్ ముహూర్తాన్ని నిర్ణయించినట్టు సమాచారం. ఆగస్ట్ 3న పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ఈ చిత్రాన్ని  ప్రారంభించబోతున్నట్టు టాక్. కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కారక్రమానికి హాజరుకానున్నారు. నెల్సన్ ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రోబో’ (Robot) తర్వాత రజనీ నుంచి ఆ స్థాయిలో మరో సినిమా రాలేదు. జైలర్ చిత్రంతో రజనీ ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటారని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. 


‘జైలర్’ చిత్రం జైల్ బ్రేక్ థ్రిల్లర్ అని సమాచారం. ఒక జైల్లోని ఖైదీల బృందం అక్కడినుంచి బైటపడేందుకు భారీ స్కెచ్ వేస్తారు. అయితే తప్పించుకొనే క్రమంలో జైలర్ వారి ప్రయత్నానికి అడ్డు తగిలి... వారిని మళ్ళీ జైల్లోకి నెట్టడం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. నెల్సన్ తరహా కామెడీకూడా ఇందులో పుష్కలంగా ఉండబోతోందట. అలాగే.. రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ కూడా అభిమానుల్ని మెప్పిస్తుందని టాక్. సెప్టెంబర్ లో ‘జైలర్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-07-21T21:38:30+05:30 IST