Rajanikanth : తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్?

ABN , First Publish Date - 2022-06-14T13:51:03+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ (Peddanna) ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. మాస్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్‌లో సైతం అభిమానుల్ని నిరాశపరిచింది. ఆయన తదుపరి చిత్రంపైనే ఇప్పుడు అందరి దృష్టి. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో తలైవా తన నెక్స్ట్ మూవీని ఖాయం చేసిన సంగతి తెలిసిందే.

Rajanikanth : తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ (Peddanna) ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. మాస్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్‌లో సైతం అభిమానుల్ని నిరాశపరిచింది. ఆయన తదుపరి చిత్రంపైనే ఇప్పుడు అందరి దృష్టి. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో తలైవా తన నెక్స్ట్ మూవీని ఖాయం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల దళపతి విజయ్‌ (Viajay) తో ‘బీస్ట్’ (Beast) మూవీని తెరకెక్కించిన నెల్సన్ .. రజనీకాంత్ కోసం ఒక అదిరిపోయే కథాంశాన్ని వండినట్టు సమాచారం. కొంతకాలంగా రజనీకాంత్ నుంచి సరైన చిత్రం రావడం లేదు. ‘రోబో’ తర్వాత (Robot) రజనీ మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని తెగ పట్టుదలగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ చిత్రంతో అది నెరవేరుతుందని ఆశిస్తున్నారు. రజనీకాంత్ 169వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఒక మాసీ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు టాక్.


తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్, నెల్సన్ కాంబో మూవీకి ‘బాస్’ (Boss) అనే మాస్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నారట. నిజానికి రజనీ మాస్ కా బాస్. ఏడుపదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆయనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని ‘పెద్దన్న’ చిత్రంతో రుజువైంది. రజనీకాంత్ క్రేజ్ కు ఆ టైటిల్ చాలా యాప్ట్ అని అభిమానులు భావిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. తెలుగులో కూడా విడుదల కాబోతున్న ఈ సినిమాకి అదే టైటిల్ ఖాయం చేస్తారని టాక్. నిజంగానే ఈ సినిమాకి ‘బాస్’ టైటిల్ నే కన్ఫర్మ్ చేస్తారో లేదో చూడాలి. 

Updated Date - 2022-06-14T13:51:03+05:30 IST