Rajanikanth 168 : షూటింగ్ మొదలయ్యేది అప్పటినుంచేనా?

ABN , First Publish Date - 2022-05-18T17:22:26+05:30 IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకి ఒకే రకమైన ఆదరణ దక్కింది. శివ (Shiva) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొటీన్ ఫార్మేట్‌లో ఉందని, కథాకథనాల్లో లోపాలున్నాయనే విమర్శలొచ్చాయి.

Rajanikanth 168 : షూటింగ్ మొదలయ్యేది అప్పటినుంచేనా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకి ఒకే రకమైన ఆదరణ దక్కింది. శివ (Shiva) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొటీన్ ఫార్మేట్‌లో ఉందని, కథాకథనాల్లో లోపాలున్నాయనే విమర్శలొచ్చాయి. అందుకే రజనీకాంత్ తన తదుపరి చిత్రం కోసం ఓ వైవిధ్యమైన కథను ఎంపిక చేశారు. తనలోని మాస్ యాంగిల్‌ను, స్టైల్‌ను బాగా ఎలివేట్ చేసే బాధ్యతను ఈ సారి యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు అప్పగించారు రజినీ. ‘కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు తలైవా‌తో ఒక అదిరిపోయే మాస్ కథాంశాన్ని తెరకెక్కించబోతున్నాడు. 


రజినీకాంత్ (Rajanikanth)  కెరీర్ లో 168వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో హోప్స్ పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ కు ఏ దర్శకుడూ సరైన హిట్టివ్వలేకపోయాడు. రజినీ మహా మాస్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేక అందరూ చేతులెత్తేశారు. అయితే ఆ లోపాన్ని సరిదిద్దగలననే నమ్మకంతో దిలీప్ రజినీకాంత్‌తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్, నెల్సన్ చిత్రం ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాని కూడా సన్ పిక్చర్స్ వారే నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న Rajanikanth 168 చిత్రం ఏ తరహా కథాంశంతో తెరకెక్కుతుందో చూడాలి. 

Updated Date - 2022-05-18T17:22:26+05:30 IST