Rajamouli : మహేష్‌ సినిమాలో రణబీర్‌ ఉన్నాడా?

ABN , First Publish Date - 2022-09-05T21:50:07+05:30 IST

అగ్ర దర్శకుడు రాజమౌళి హిందీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగు వెర్షన్‌కి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి, అతని టీం చాలా దూకుడుగా ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్‌ కోసం రాజమౌళి రణబీర్‌ కపూర్‌ని కొంచెం తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చారని తెలుస్తోంది.

Rajamouli : మహేష్‌ సినిమాలో రణబీర్‌ ఉన్నాడా?

అగ్ర దర్శకుడు రాజమౌళి (Raja mouli)హిందీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)సినిమా తెలుగు వెర్షన్‌కి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి, అతని టీం చాలా దూకుడుగా ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్‌ కోసం రాజమౌళి  రణబీర్‌ కపూర్‌ని కొంచెం తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఆయన సలహాతోనే రణబీర్‌(Ranbir kapoor) అతని భార్య అలియా ఇద్దరూ తెలుగులో చిన్న చిన్న ముక్కలు మాట్లాడారు. అలియా అయితే పాట కూడా పాడారు.  గతంలో ఎప్పుడూ ఓ హిందీ చిత్రాన్ని ఇంతగా ప్రచారం చెయ్యలేదు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ టీం మాత్రం తెలుగులో విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ‘బిగ్‌ బాస్‌’ వేదికపై రణబీర్‌, అలియాభట్‌ సందడి చేశారు. ఇంకొన్ని రియాలటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఇదే సినిమా రెండో పార్టు విడుదల సమయానికి తెలుగు పూర్తిగా నేర్చుకుంటానని చెప్పాడు రణబీర్‌. అయితే రణబీర్‌ తెలుగు నేర్చుకోవడం వెనుక రాజమౌళి టీం, కార్తికేయ ఉన్నట్టు తెలిసింది. బాలీవుడ్‌ హీరోతో తెలుగు మాట్లాడించడానికి రాజమౌళి ఎందుకు ఇంతగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయంపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. 


రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్‌బాబుతో చేయనున్నారు. అందులో రణబీర్‌ను ఓ పాత్ర కోసం తీసుకుంటునట్లు తెలుస్తోంది. అందుకే రణబీర్‌కి తెలుగు నేర్చుతున్నారట. ఆ సినిమా ఎలాగు వచ్చే సంవత్సరమే ప్రారంభం అవుతుంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ట్యూటర్‌ని పెట్టి తెలుగు నేర్పిస్తున్నారట రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో తెలుగులో కూడా క్రేజ్‌ తెచ్చుకున్న ఆలియా రాజమౌళికి ఓ మాట చెప్పిందని కూడా అంటున్నారు. దానికి తోడు రణబీర్‌ సినిమాలో ఉంటే, ఆ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కన్నా ఎక్కువ రీచ్‌ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. నాగార్జున లాంటి స్టార్‌ హీరో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఉన్నా రాజమౌళి ఫోకస్‌ మాత్రం రణబీర్‌ మీదే ఉంది. దీనిని బట్టి చూస్తే రాజమౌళి తదుపరి సినిమాలో, మహేష్‌బాబుతోపాటు రణబీర్‌ కపూర్‌ కూడా వుండే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆలా అయితే ఆ మల్టీస్టారర్‌ మరో లెవల్‌లో ఉండే అవకాశం ఉంది. 


Updated Date - 2022-09-05T21:50:07+05:30 IST