Kamal haasan : డేట్స్ కోసం రాజమౌళి, ప్రశాంత్‌నీల్ వెయిటింగ్ ?

ABN , First Publish Date - 2022-05-22T16:36:53+05:30 IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వెర్సటైల్ యాక్టర్స్‌లో విశ్వనాయకుడు కమల్‌హాసన్ (Kamal haasan) ఒకరని వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి పరిచయం కూడా అవసరం లేని ఆయన ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీస్‌ను ఏలారు. ప్రస్తుతం కమల్ లోకేష్ కనగరాజ్ (Lokesh kangaraj) దర్శకత్వంలో ‘విక్రమ్’ (Vikram) అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Kamal haasan : డేట్స్ కోసం రాజమౌళి, ప్రశాంత్‌నీల్ వెయిటింగ్ ?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వెర్సటైల్ యాక్టర్స్‌లో విశ్వనాయకుడు కమల్‌హాసన్ (Kamal haasan) ఒకరని వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి పరిచయం కూడా అవసరం లేని ఆయన ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీస్‌ను ఏలారు. ప్రస్తుతం కమల్ లోకేష్ కనగరాజ్ (Lokesh kangaraj) దర్శకత్వంలో ‘విక్రమ్’ (Vikram) అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీని తర్వాత కమల్ నటించబోయే సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. ఆయన డేట్స్ కోసం దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) ఎదురు చూస్తున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే కమల్ సోలో హీరోగా ఆ ఇద్దరూ సినిమాలు తీయబోతున్నారని అనుకోకండి. వారి తదుపరి చిత్రాల్లో ఓ ప్రత్యేక పాత్ర కోసం కమల్‌ను సంప్రదించబోతున్నారని సమాచారం అందుతోంది. 


మహేశ్‌బాబు (Mahesh babu) హీరోగా, రాజమౌళి (Rajamouli) త్వరలోనే ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. SSMB29గా పిలుచుకొనే ఆ మూవీలో ఓ ప్రత్యేక పాత్రను కమల్‌హాసన్ (Kamal haasan) మాత్రమే చేయగలరని జక్కన్న భావిస్తున్నారట. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాలోని ఆ పాత్రకోసం త్వరలోనే రాజమౌళి కమల్‌ను సంప్రదించబోతున్నారట. అలాగే ఆయన డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట. ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్‌లోని అడ్వంచరస్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. 


ఇక ఇటీవల ‘కేజీఎఫ్ 2’ (KGF 2) తో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) ప్రస్తుతం ప్రభాస్ (prabhas) తో ‘సలార్’ (Salaar) చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ప్రశాంత్.. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) తో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. NTR 31 గా పిలుచుకొనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై.. మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను కమల్‌హాసన్ (Kamal haasan) చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట ప్రశాంత్. ఆయన కూడా కమల్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడట. భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కబోయే ఈ రెండు సినిమాల్లో కమల్‌హాసన్ నటించే విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాబోతున్నాయని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ రెండు సినిమాల్లో కమల్ హాసన్ నటిస్తే ఆ సినిమాలపై హైపు మరింతగా పెరుగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. 

Updated Date - 2022-05-22T16:36:53+05:30 IST