డాల్బీ అట్మాస్‌తో కొత్త అనుభూతి కలుగుతుంది: రాజమౌళి

ABN , First Publish Date - 2022-03-24T23:47:36+05:30 IST

రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. కొత్త టెక్నాలజీతో సినిమాను హంగు ఆర్బాటాలతో తీర్చిదిద్దడంతో ఆయన శైలి వేరు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను త్రీడీ ఫార్మెట్‌, వర్చువల్‌ రియాలిటీను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో డాల్బీ విజన్‌ను ఇండియన్‌ స్ర్కీన్‌కి పరిచయం చేస్తున్నారు.

డాల్బీ అట్మాస్‌తో కొత్త అనుభూతి కలుగుతుంది: రాజమౌళి

రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. కొత్త టెక్నాలజీతో సినిమాను హంగు ఆర్బాటాలతో తీర్చిదిద్దడంతో ఆయన శైలి వేరు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను త్రీడీ ఫార్మెట్‌, వర్చువల్‌ రియాలిటీను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో డాల్బీ విజన్‌ను ఇండియన్‌ స్ర్కీన్‌కి పరిచయం చేస్తున్నారు. ఆ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  కావడం విశేషం. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రాన్ని 2డీ, 3డీ, డాల్బీ ఎట్మాస్‌తోపాటు కొత్త టెక్నాలజీ డాల్బీ విజన్‌ ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి వెల్లడించారు. ‘డాల్బీ విజన్‌’లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను చూసి ఆస్వాదించాలని ఆయన కోరారు. 


సౌండ్‌ సిస్టమ్‌లో డాల్బీ కంపెనీకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాకు చెందిన డాల్బీ లేబొరేటరీస్‌ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడియో, వీడియో ఫార్మాట్‌లను అత్యున్నత సాంకేతికతతో అందించడం డాల్బీ ప్రత్యేకత. తాజాగా తెరపై మనం చూస్తున్న ప్రతి సన్నివేశాన్నీ డాల్బీ విజన్‌ తెరపై పదిరెట్లు క్వాలిటీతో చూడవచ్చు. 35 ఎంఎం స్ర్కీన్‌పై సినిమాకు, 70ఎంఎం స్ర్కీన్‌ మీద సినిమాకు అనుభూతి వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు చీకట్లో ఉన్న వస్తువును చూడటానికి ఒక దీపం వెలిగిస్తే ఆ వస్తువు ఒక దీపం వెలుగులో ఒకలా కనిపిస్తుంది. వెయ్యి దీపాల వెలుగులో ఒకలా, పదివేల దీపాల వెలుగులో మరొకలా కనిపిస్తుంది. సినిమాను డాల్బీ విజన్‌లో చూస్తే అంతే స్పష్టత కనిపిస్తుంది. డాల్బీ విజన్‌తో డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉన్న సినిమా హాల్లో సినిమా చూస్తే ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలుగుతుంది. డిజిటల్‌లో ఫార్మాట్‌లో ఉన్న నార్మల్‌ వీడియో కంటెంట్‌ను ఐమాక్స్‌ తెరపై మూడింతలు క్వాలిటీగా కనిపిస్తే డాల్బీ విజన్‌లో నాలుగింతలు స్పష్టంగా ఉంటుంది.



మన దేశంలో ఉన్న కొన్ని ఐమాక్స్‌ స్ర్కీన్‌లో మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం  డాల్బీ విజన్‌ ఉన్న థియేటర్లు మన దేశంలో అందుబాటులో లేదు. మామూలు స్ర్కీన్‌తో పోలిేస్త డాల్బీ ప్రొజెక్టర్స్‌ 500 రెట్ల కాంట్రాస్ట్‌ రేషియోతో పాటు నాలుగురెట్లు క్వాలిటీ లైటింగ్‌తో ఉంటుంది. అయితే మన దగ్గర డాల్మీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ థియేటర్‌లో డాల్బీ డీటీఎస్‌ కొత్త అనుభూతిని కలిగించినట్లు డాల్బీ అట్మాస్‌ అంతకుమించి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మన దేశంలో 500లకు పైగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. అందుకే విదేశాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని డాల్బీ విజన్‌లో చూసి ఎంజాయ్‌ చేయమని రాజమౌళి చెబుతున్నారు. 



రాజమౌళి మాట్లాడుతూ...

‘‘త్రీడీలో సినిమా తీస్తే స్కేల్‌ తగ్గిపోతుంది. అందుకే నాకు త్రీడీ నచ్చదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నప్పుడు 3డీ గురించి నన్ను అడిగితే నాకు నచ్చదని చెప్పా. టెక్నాలజీ మారింది మాకు కొన్ని షాట్స్‌ ఇవ్వండి. అవుట్‌పుట్‌ మీకు నచ్చితే నెక్ట్స్‌ స్టెప్‌ వేద్దాం. లేకపోతే వద్దు’’ అని అన్నారు. సరే అని కొన్ని సాట్లు ఆ కంపెనీకి ఇచ్చారు. ఎలాగూ నో చెబుతానని నాకు తెలుసు. ఒకసారి త్రీడీ అవుట్‌పుట్‌ చూశా. ఆ టెక్నాలజీ వల్ల స్కేల్‌ ఏమాత్రం తగ్గలేదు. 2డీ తెరపై చూసిపదానికి త్రీడీలో చూసిన దానికి చాలా తేడా ఉంది. 3డీ స్ర్కీన్‌పై తారక్‌, చరణ్‌ భావోద్వేగానికి గురైతే మన దగ్గరకు వచ్చి ఫీలైన భావన కలిగింది. 3డీలో కూడా ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందా? అనిపించింది. వెంటనే ఓకే చెప్పా. కరోనా సమయంలో షూటింగ్‌ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని 3డీ వెర్షన్‌కు కేటాయించా. డాల్బీ విజన్‌లో చూడటం ఒక అద్భుతం. రూ.500 కోట్ల పెట్టుబడి నాణ్యత కనిపించాలంటే ఐమాక్స్‌లో చూడాలి. హీరోలిద్దరే చేసిన నటన చూడాలంటే 3డీలో చూడండి’’ అని రాజమౌళి అన్నారు. 

Updated Date - 2022-03-24T23:47:36+05:30 IST