Beyond Fest: రాజమౌళి సినిమాలకు అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2022-09-08T23:26:44+05:30 IST

తెలుగు సినిమాను ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి (Ss rajamouli). ‘బాహుబలి’ (Bahubali)రెండు చిత్రాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో హాలీవుడ్‌లోనూ పేరు పొందారు.

Beyond Fest: రాజమౌళి సినిమాలకు అరుదైన గౌరవం!

తెలుగు సినిమాను ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి (Ss rajamouli). ‘బాహుబలి’ (Bahubali)రెండు చిత్రాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో హాలీవుడ్‌లోనూ పేరు పొందారు. రాజమౌళి నుంచి ఆ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మేకింగ్‌, సినిమా సక్సెస్‌ చూసి హాలీవుడ్‌ మేకర్స్‌ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఏర్పాటు చేసి వర్చువల్‌ కాల్‌లో రాజమౌళితో రూసో బ్రదర్స్‌ మాట్లాడారు. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. బియాండ్‌ ఫెస్ట్‌ (Beyond fest)అనేది హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో విశేష ఆదరణ పొందిన ఫెస్టివల్‌. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ వేడుక నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్‌లో.. టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ అంటూ ఏర్పాటు చేసిన వేదికపై రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ టీమ్‌ గురువారం ఓ ట్వీట్‌ చేసింది. సెప్టెంబర్‌ 30న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, అక్టోబర్‌ 1న ‘ఈగ’, ‘బాహుబలి’, ‘బాహుబలి–2’, అక్టోబర్‌ 21న ‘మగధీర’, అక్టోబర్‌ 23న ‘మర్యాద రామన్న’ చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి  పేరు అంతర్జాతీ స్థాయిలో మార్మోగింది. ఆ క్రేజ్‌తో ఆయన చిత్రాలను ప్రేక్షకులు చూడటానికి ఆసక్తిగా ఉన్నారని గ్రహించిన బియాండ్‌ ఫెస్ట్‌ నిర్వాహకులు ఆ చిత్రాలను ప్రదర్శించనున్నారట. 



Updated Date - 2022-09-08T23:26:44+05:30 IST