S.S. Rajamouli: అస్త్రాలకు మించిన శక్తి మరొకటి ఉంది!

ABN , First Publish Date - 2022-09-02T00:33:19+05:30 IST

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలు పోషించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున కీలక పాత్రధారులు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు వెర్షన్‌రు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

S.S. Rajamouli: అస్త్రాలకు మించిన శక్తి మరొకటి ఉంది!

రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor), అలియా భట్‌(Alia bhatt) ప్రధాన పాత్రలు పోషించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’(Brahmstra). అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున కీలక పాత్రధారులు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు వెర్షన్‌రు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 


‘‘ఈ చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన తీసిన ‘వేకప్‌ సిద్‌’, ‘యే జవానీ హై దివానీ’ ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్స్‌. 2016లో ఆయన నన్ను మొదటిసారి కలిసి ‘బ్రహ్మాస్త్ర’ కథ చెప్పాడు. హిందూ పురాణాలు ఆధారంగా రాసిన ఈ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న శక్తున్నింటినీ కలిపి ‘అస్త్రవర్స్‌’ అని క్రియేట్‌ చేశాడు. దీనికి అర్థం ఏంటంటే..  శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచభూతాలు. వాటిని శాసించేది బ్రహ్మశక్తి. ఆ శక్తి నుంచి పుట్టిన అస్ర్తాలు, వాటిని ప్రయోగించే సూపర్‌హీరోలు గురించి చెప్పే కథే బ్రహ్మాస్త్ర. వానరాస్త్రాకు కింగ్‌కాంగ్‌కు ఉన్నంత బలం ఉంటుంది. అలాగే నంది అస్త్రాను ధరించిన వారికి వెయ్యి ఒంగోలు గిత్తల శక్తి ఉంటుంది. ఇలాంటి అస్ట్రాలు, వాటిని ఉపయోగించే సూపర్‌ హీరోలు, వాటి మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్స్‌కు విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి అద్భుతమైన విజులవ్‌ వండర్‌లా అయాన్‌ ఈ చిత్రాన్ని సృష్టించాడు. వీటన్నింటికన్నా బలమైన శక్తి మరొకటి ఉంది. అదే ప్రేమ. ఇద్దరి వ్యక్తుల మధ్యం ఉండే ప్రేమ.. ఎలాంటి శక్తినైనా ఎదుర్కోగలదని ఈ సినిమాలో చూపించాడు అయాన్‌. ఈ అద్భుమైన భారతీయ చిత్రాన్ని డిస్నీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతుండడం మరో విశేషం’’ అని రాజమౌళి వీడియోలో పేర్కొన్నారు.  




Updated Date - 2022-09-02T00:33:19+05:30 IST