ఆస్తులన్నీ అందాల రాశి పేరున రాసేసిన రాజ్ కుంద్రా... ఇప్పుడు శిల్పా శెట్టి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-04T22:14:53+05:30 IST

బాలీవుడ్ తార శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గతేడాది ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బెయిల్ మీద బయట ఉన్నాడు

ఆస్తులన్నీ అందాల రాశి పేరున రాసేసిన రాజ్ కుంద్రా... ఇప్పుడు శిల్పా శెట్టి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

బాలీవుడ్ తార శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గతేడాది ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ మధ్యనే అతడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పేరు మీద ఉన్న కోట్ల విలువ చేసే ఆస్తులను శిల్పాశెట్టికి బదిలీ చేశాడు.


ముంబై జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్‌ వ్యూ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపుగా 5,995 చదరపు అడుగులు ఉంటుందని తెలుస్తోంది. అతడు శిల్పాకు రాసిచ్చిన ఆస్తుల విలువ దాదాపుగా రూ.38.5కోట్లు ఉంటుందని సమాచారం. శిల్పా పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దాదాపుగా రూ. 1.9కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించాడు. ట్రాన్స్‌ఫర్ డీడ్ రిజిస్ట్రేషన్ జనవరి 21న జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర దాదాపుగా రూ.65వేలు ఉంటుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తెలుపుతున్నారు.

Updated Date - 2022-02-04T22:14:53+05:30 IST