Ranbir Kapoor-Alia Bhatt పెళ్లి తేది మారిందా?.. అలియా భట్ సోదరుడు ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-04-13T14:47:51+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ లవ్‌బర్డ్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంట ఒకటి. ఇటీవల బీ టౌన్‌లో ఎక్కడ చూసిన ఈ జంట పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.

Ranbir Kapoor-Alia Bhatt పెళ్లి తేది మారిందా?.. అలియా భట్ సోదరుడు ఏమన్నాడంటే..

బాలీవుడ్‌లోని క్రేజీ లవ్‌బర్డ్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంట ఒకటి.  ఇటీవల బీ టౌన్‌లో ఎక్కడ చూసినా ఈ జంట పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. వీరి మ్యారేజ్ ఆ ప్లేస్‌లో జరుగుతుంది.. ఈ ప్లేస్‌లో జరుగుతుంది.. తేది ఇదేనంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కపుల్ పెళ్లి పీటలు ఎక్కబోయేది ఏప్రిల్ 13 లేదా 14న అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబైలోని ఆర్‌కే స్టూడియోలో వాళ్ల గ్రాండ్ వెడ్డింగ్‌కి వేదిక కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పెళ్లి తేది మారినట్లు తెలుస్తోంది.


రణ్‌బీర్‌గానీ, అలియాగానీ, వారి కుంటుంబ సభ్యులు గానీ ఇంతవరకు ఈ వార్తలపై సరిగ్గా స్పందించలేదు. ఈ తరుణంలో అలియా సవతి సోదరుడు రాహుల్ భట్ చెప్పాడంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వారి పెళ్లి ఏప్రిల్ 13, 14 నుంచి ఏప్రిల్ 20కి పోస్ట్ పోన్ అయినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. పెళ్లి తేదీలు లీక్ కావడంతోనే డేట్ మార్చినట్లు తెలుస్తోంది. దీని గురించి త్వరలోనే ఈ లవ్‌బర్డ్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందట. మరోవైపు తేదీ కాదని, పెళ్లి వేదిక తాజ్ హోటల్‌కి మారిందని రాహుల్ చెప్పినట్లు కూడా వినిపిస్తోంది. అయితే ఈ జంట ఇళ్లలో మాత్రం పెళ్లి ఆరెంజ్‌‌మెంట్స్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. ఇదైనా నిజమో లేక రూమర్‌గా మిగిలిపోతుందో..

Updated Date - 2022-04-13T14:47:51+05:30 IST