Raghava Lawrence : వైరల్ అవుతోన్న లేటెస్ట్ లుక్

ABN , First Publish Date - 2022-09-14T16:39:57+05:30 IST

స్టార్ కొరియోగ్రఫర్‌గా ఒకప్పుడు సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ఆ తర్వాత హీరోగానూ, దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు. కోలీవుడ్‌లో కామెడీ హారర్ సిరీస్ తీయడంలో తాను కింగ్‌నని నిరూపించుకున్నాడు.

Raghava Lawrence : వైరల్ అవుతోన్న లేటెస్ట్ లుక్

స్టార్ కొరియోగ్రఫర్‌గా ఒకప్పుడు సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ఆ తర్వాత హీరోగానూ, దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు. కోలీవుడ్‌లో కామెడీ హారర్ సిరీస్ తీయడంలో తాను కింగ్‌నని నిరూపించుకున్నాడు. ‘మాస్ (Mass), డాన్ (Don), రెబల్ (Rebel)’ లాంటి యాక్షన్ చిత్రాలతో తెలుగులోనూ దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం లారెన్స్.. ‘చంద్రముఖి 2’ (Chandramukhi) చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రజనీకాంత్ (Rajanikanth) నటించిన ‘చంద్రముఖి’ చిత్రం సూపర్ హిట్ అయినా.. దానికి ఇంతవరకూ తమిళంలో సీక్వెల్ తీయలేకపోయారు. రెండో భాగంలో నటించడానికి రజనీ ఆసక్తి చూపించకపోవడమే దీనికి కారణం. అయితే ఆ తరహా హారర్ చిత్రాలకు రాఘవ లారెన్స్ బెస్ట్ ఆప్షన్ అని భావించిన మేకర్స్.. అతడితో రెండో భాగం తీయడానికి ముందుకొచ్చారు. 


పి.వాసు (P Vasu) దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కుతోంది. మొదటి షెడ్యూల్ మైసూర్‌లో పూర్తయింది. తాజాగా రాఘవ లారెన్స్ .. కండలు తిరిగిన శరీరంతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆయన బాడీకి నెటిజెన్స్ షాకవుతున్నారు.  ‘చంద్రముఖి 2’ చిత్రం కోసమే తాను ఇలా మారానని అది అందరినీ నచ్చుతుందని ఆశిస్తున్నానని లారెన్స్ తెలిపారు. కండలు తిరిగి శరీరంతో హీమేన్ లా కనిపిస్తున్న ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. దీనికి యం.యం.కీరవాణి సంగీతం అందించనుండడం విశేషమని చెప్పాలి. ‘ముని’ సిరీస్, ‘శివలింగ’ చిత్రాల తర్వాత లారెన్స్ మాస్టర్ మరోసారి నటిస్తున్న ఈ హారర్ కామెడీ ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ సినిమాలోని లారెన్స్ మజిల్స్ బాడీ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.



Updated Date - 2022-09-14T16:39:57+05:30 IST