chandramukhi 2 : రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్

ABN , First Publish Date - 2022-07-15T20:08:06+05:30 IST

సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajanikanth) నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ‘మణిచిత్ర తాళు’ (Manichithra Tazhu) మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు (P Vasu) కన్నడలో ‘ఆప్తమిత్ర’ (Aptha Mitra) పేరుతో రీమేక్ చేశారు.

chandramukhi 2 : రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్

సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajanikanth) నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ‘మణిచిత్ర తాళు’ (Manichithra Tazhu) మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు (P Vasu) కన్నడలో ‘ఆప్తమిత్ర’  (Aptha Mitra) పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘ఆప్తరక్షక’ (Aptha Rakshaka) తెరకెక్కించారు. విష్ణువర్ధన్ (Vishnu Vardhan), సౌందర్య (Soundarya) ప్రధాన పాత్రలు పోషించిన ఈ రెండు సినిమాలూ అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో ‘ఆప్తమిత్ర’ చిత్రాన్ని తమిళంలో చంద్రముఖిగా రీమేక్ చేశారు పి.వాసు. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే కన్నడలో ఆయన తీసిన రెండో భాగం ‘ఆప్తరక్షక’ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ (Venkatesh) హీరోగా నాగవల్లి (Nagavalli) గా రీమేక్ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. 


అయితే ‘ఆప్తరక్షక’ చిత్రానికి పి.వాసు తమిళ వెర్షన్ ను ఇంతవరకు తీయలేదు. దాదాపు పదిహేడేళ్ళ తర్వాత ‘చంద్రముఖి’ చిత్రానికి రెండో భాగం రాబోతోంది. రాఘవ లారెన్స్ (Raghava Larence) హీరోగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ..  శుక్రవారం మైసూర్ లో మొదలైంది. . పి.వాసు దర్శకత్వంలో, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుపుకోనుంది. అయితే ఇది ‘ఆప్తరక్షక’ చిత్రానికి సీక్వెలా కాదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రంలో హీరోగా నటిస్తున్న రాఘవ లారెన్స్.. మొదటి భాగం హీరో రజినీకాంత్ ఆశీస్సులు తీసుకోవడం విశేషంగా మారింది. శుక్రవారం చెన్నైలోని రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు లారెన్స్. తన మోకాళ్ళపై పడుకొని రజనీ పాదాల్ని తాకారు లారెన్స్. 


దీనికి సంబంధించిన ఫోటోను లారెన్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు లారెన్స్. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ .. ఈ రోజు ‘చంద్రముఖి 2’ రెగ్యులర్ షూటింగ్ నా తలైవర్, నా గురు రజనీకాంత్ ఆశీర్వాదంతో మైసూర్ లో మొదలైంది. ఈ సందర్బంగా అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు లారెన్స్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ (Super Subbarayan) కార్ క్లీనర్‌గా పనిచేసే లారెన్స్‌లో డ్యాన్సర్‌ను మొదట గుర్తించింది రజనీకాంతే. ఆయన రికమండేషన్ తోనే డ్యాన్సర్స్ యూనియన్ సభ్యుడిగా జాయిన్ అయ్యారు లారెన్స్.  ఆ తర్వాత ప్రభుదేవా (Prabhu deva) ట్రూప్‌లో డ్యాన్సర్ గా చేరారు. అయితే లారెన్స్‌ను డ్యాన్స్ మాస్టర్ ‌ను చేసిన ఘనత మాత్రం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి దక్కుతుంది. ‘హిట్లర్’ (Hitler) సినిమాతో లారెన్స్‌కు కొరియోగ్రాఫర్ గా తొలి అవకాశమిచ్చి.. ఆయనలోని టాలెంట్ ను వెలికితీశారు చిరంజీవి. 



Updated Date - 2022-07-15T20:08:06+05:30 IST