Radhika Apte: ఆ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు.. నటి ఉచిత సలహా

ABN , First Publish Date - 2022-11-07T16:14:34+05:30 IST

సౌత్ ఇండియాలోనూ మంచి పాపులారిటీ ఉన్న బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ముఖ్యంగా బాలీవుడ్‌లోని నటీమణుల్లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది..

Radhika Apte: ఆ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు.. నటి ఉచిత సలహా

సౌత్ ఇండియాలోనూ మంచి పాపులారిటీ ఉన్న బాలీవుడ్ (Bollywood) నటి రాధికా ఆప్టే (Radhika Apte). ముఖ్యంగా బాలీవుడ్‌లోని నటీమణుల్లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా బోల్డ్ పాత్రలు చేయడంతో పాటు ఈ భామ మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉంటాయి. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘మోనిక ఓ మై డార్లింగ్’ (Monica, O My Darling). రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో జరిగిన ప్రమోషన్స్‌లో కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


రాధికా ఆప్టే ప్రేమికులకు, దంపతులకు ఒక సూచన ఇచ్చింది. ‘ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్థలు తలెత్తితే మూడో వ్యక్తి మాట వినొద్దు. అసలు థర్డ్‌ పార్టీని జోక్యం చేసుకోనివ్వొద్దు. ఎందుకంటే, అలాంటి వారు మన మధ్యలో ప్రవేశిస్తే సమస్య మరింత పెద్దదై సంబంధాలకు బీటలు వారే ప్రమాదం ఉంది. మన జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మనకు మాత్రమే తెలుసు. మూడో వ్యక్తికి  తెలియదు. కొన్నిసార్లు వాళ్లు మనల్ని ఇంకా ఇబ్బందులలోకి తీసుకెళతారు. అందువల్ల అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి’ అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది.





Updated Date - 2022-11-07T16:14:34+05:30 IST